Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్లాస్టిక్ వినియోగంపై దాడులు నిర్వహించిన మునిసిపల్ అధికారులు

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని అంజుమాని సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్లు శాంక్షన్ కేశవ లతోపాటు శానిటరీ కార్యదర్శులు ప్లాస్టిక్ వినియోగముపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 170 కేజీల ప్లాస్టిక్ను సీజ్ చేసి 26 వేల రూపాయలను జరిమానా విధించడం జరిగిందని శానిటరీ ఇన్స్పెక్టర్లు తెలిపారు. అనంతరం శంషాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హోల్సేల్ రిటైల్ షాపులలో ప్లాస్టిక్ను అమ్మ రాదని, అలా అమ్మితే జరిమానా తో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. కావున ప్రజలు కూడా ప్లాస్టిక్ నియంత్రణపై సహాయ, సహకారాలు అందించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img