Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

“జూద క్రీడలు వద్దు… సాంప్రదాయ ఆటలు ముద్దు”

కోడిపందేలు, పేకాట ఆడితే కఠినచర్యలు తప్పవు

– జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలు పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. కోడిపందేలు, పేకాట నిర్వహుకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. “జూద క్రీడలు వద్దు… సాంప్రదాయ ఆటలు ముద్దు” అన్ని ఎస్పీ సూచించారు. జూద వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుందని… అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమన్నారు. కోడి పందేల జూదరులు, కోడి కత్తులు తయారీదారులు పేకాట, నిర్వహకులపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. వారిపై గట్టి నిఘా ఉంచామన్నారు. కోడి పందేలు, జూదాల వల్ల ప్రజలు సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశ పడి పందేలు కాసి వారి యొక్క ధనాన్ని నష్టపోతున్నారన్నారు. దీనివలన వారి కుటుంబాలలో పండగ పూట కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. కనుక ఎక్కడ కోడి పందేలు,జూదం నిర్వహించకుండా వుండేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా జిల్లాలో కోడి పందేలు నిర్వహించినా, పందేలు నిర్వహణకు స్థలాలు,భూములు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు యువకులు జూదాలకు బానిసలై… కేసుల్లో ఇరుక్కుపోయి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత ఇటువంటి కేసులలో ఉంటే వారి యొక్క భవిష్యత్తు అంధకారమవుతుందని…ఇతర దేశాలలో ఉద్యోగాల కొరకు వెళ్లే వారికి మరియు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే సమయములో, పాస్ పోర్ట్ పొందే సమయాలలో ఈ కేసులు అడ్డంకిగా మారి యువత యొక్క జీవితాలు అధోగతి పాలవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా కోడిపందేలు ఆడినా, జూదం ఆడినా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100,112 లేదా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 14500 లకి ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img