London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ధర్మవరం సబ్ డివిజన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, అల్లర్లు జరగకుండా చూడడమే మా లక్ష్యం

డీఎస్పీ శ్రీనివాసులు
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం డివిజన్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు అల్లర్లు జరగకుండా చూడడమే మా లక్ష్యము అని డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో 144 సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ మంది గుముకూడి కూడా రాదని అలా గుమ్మ కూడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నిచోట్ల తగిన బందోబస్తు కాన్ఫెన్టివ్ కాయిల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా ఇమ్షాత్మక ఘటనకు పాల్పడిన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగిందన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు ప్రకారం బాణాసంచా నిల్వ ఉంచడం క్రయవిక్రయాలు చేయడం కాల్ చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ప్రజలందరూ సమయస్ఫూర్తితో ఉంటూ ఎన్నికల కౌంటింగ్ కూడా సజావుగా పూర్తి అయ్యేలా ప్రజలు సహకరించాలని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని కేసులు నమోదు చేసి రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. ఇప్పటికే సమాజ అశాంతికి కారణమైన వారిని గుర్తించి 14 మందిపై జిల్లా బహిష్కరణకు 14 మందితో కూడిన జాబితాను కలెక్టర్కు పంపించి జిల్లా బహిష్కరణకు అనుమతి కూడా పొందడం జరిగిందన్నారు. జూన్ 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధమని, అపరిచితులు అనుమానితులు లాడ్జిలో బస చేయకూడదని, పందాలు కాయకుండా లాడ్జిల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, మద్యం సేవించి గొడవలకు కారణమయ్యే అవకాశం ఉన్న హోటల్లో కూడా క్షుణ్ణంగా చెకింగ్ లు చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ వేల సత్ప్రవర్తనతో జీవించాలని, ప్రశాంతంగా మెలగాలని సూచిస్తూ రౌడీ షీటర్లకు, ట్రబుల్ మాంగెర్స్, హిస్టరీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా సబ్ డివిజన్ పరిధిలోని సమస్య ఆత్మక గ్రామాలు కానీ కాలనీలలో అల్లర్లు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు భాగంగా ప్రాథమిక దశలోనే తుంచి వేయడానికి డ్రోన్ కెమెరాలతో నిఘా వేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img