పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం పోలీసు పరేడ్ మైదానంలో ఈనెల 15 వ తేదీన నిర్వహించే పంద్రాగస్టు వేడుకలకు సాయుధ పోలీసు బలగాలు సాధన చేస్తున్నాయి. స్థానిక పరేడ్ మైదానంలో కొనసాగుతోన్న పరేడ్ ప్రాక్టీస్ ను జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు శుక్రవారం పర్యవేక్షించారు. జాతీయ సమైక్యత, దేశభక్తి భావం వెల్లువిరిసేలా, నలుదిశలా వ్యాపించేలా పరేడ్ నిర్వహించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు, ఆర్ ఐ లు హరికృష్ణ, శివరాముడు, పలువురు ఆర్ ఎసా ఐ లు, తదితరులు పాల్గొన్నారు.