Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలి

మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉరవకొండ పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.
శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉరవకొండ పట్టణంలోని తొగట వీర క్షత్రియ కళ్యాణమండపంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించగా, సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ఏపీఐఐసీ చైర్ పర్సన్ మెట్టు గోవిందరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ, ఉన్నత విద్యా మండలి సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అనంతపురం రోడ్ లోని భారత్ పెట్రోలియం వద్ద ఏర్పాటు చేస్తున్న సభాస్థలి, హెలీప్యాడ్ ఏర్పాటు కోసం ఉరవకొండ పట్టణంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల మైదానాలను జిల్లా ఇంచార్జి మంత్రి, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 23వ తేదీన వైఎస్సార్ ఆసరా నిధులను జమ చేసేందుకు ఉరవకొండ రానున్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జాగ్రత్తగా చేయాలని, ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్యక్రమం కొనసాగేలా చూడాలన్నారు. అధికారులు వారికి కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటించాలని, కార్యక్రమానికి విచ్చేసే వారు ఇబ్బంది పడకుండా భోజనం, స్నాక్స్, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరిని బలవంతంగా సమావేశానికి తీసుకురాకూడదని సూచించారు. సమావేశం నిర్వహించే సభాస్థల వద్ద అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని, డిఆర్డిఏ, మెప్మా అధికారులు కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మహిళలందరికీ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు నిర్వహిస్తున్న ఈ వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ప్రధాన వేదిక, హెలిప్యాడ్, అన్ని ప్రాంతాల్లో ఎటువంటి సమస్య రాకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన వేదిక ఏర్పాటు, లబ్ధిదారుల ఇంటరాక్ట్, విఐపి, వాహనాల పాసులు, పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాట్లు, ఎల్1, ఎల్2 జాబితా తయారు, గ్యాలరీల ఏర్పాటు, భోజనం, తాగునీరు, తదితర అన్ని రకాల ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లోని శానిటేషన్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టడం జరిగిందని, ఏమైనా చిన్న సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమానికి ఎవరైతే లబ్ధిదారులు స్వచ్ఛందంగా వస్తారో వారిని సభకు తరలించాలన్నారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులకు కేటాయించిన విధులను జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు. అధికారులంతా సమన్వయం చేసుకొని పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మొదటిసారి ఉరవకొండకు వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలన్నారు. వెనుకబడిన ఉరవకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలన్నారు.
ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఉరవకొండలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. వేలాది మంది మహిళలు, ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి సమావేశానికి వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఎడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ మంజుల, అడిషినల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, గుంతకల్లు ఆర్డీఓ వి.శ్రీనివాసులు రెడ్డి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, మెప్మా పీడి విజయలక్ష్మి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఐఅండ్ పీఆర్ డిఐపీఆర్ఓ గురుస్వామి శెట్టి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నాగరాజారావు, సమగ్ర శిక్ష ఏపిసి వరప్రసాద్, హార్టికల్చర్ డిడి రఘునాథ రెడ్డి, ఏపీఎంఐపి పిడి ఫిరోజ్ ఖాన్, పీఆర్ ఎస్ఈ భాగ్యరాజ్, డిటిసి వీర్రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, డీఈఓ నాగరాజు, ఆర్అండ్ బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, డీఎస్ఓ శోభారాణి, తహశీల్దార్ శ్రీధర్ మూర్తి, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img