Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జిల్లా నుంచి ఎన్నికల కమీషన్ కు పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా నుంచి పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలను ఎన్నికల కమీషన్ కు ఈనెల 5వ తేదీ నాటికి పంపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 2,213 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరగగా, కొత్తగా 23 సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనల ఎన్నికల కమీషన్ కు పంపిస్తున్నామన్నామన్నారు. అలాగే 4 స్థానాల మార్పు, 85 నామకరణం మార్పునకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందన్నారు. ఇందులో సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించి ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4 సహాయక పోలింగ్ కేంద్రాలు, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2, అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 సహాయక పోలింగ్ కేంద్రాలు, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత ఈఆర్వోల నుంచి ప్రతిపాదనలు రావడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రతిపాదనలను ఎన్నికల కమీషన్ కు పంపిస్తామన్నారు. 1,450 నుంచి 1,500 మధ్య ఓటర్లు ఉంటే సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతోందన్నారు.
అనంతపురం అర్బన్ లోనే 4 స్థానాల మార్పునకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నామకరణం మార్పునకు సంబంధించి రాప్తాడు నియోజకవర్గం నుంచి 1, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 17, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 21, తాడిపత్రి నుంచి 8, సింగనమల నుంచి 3, అనంతపురం అర్బన్ నుంచి 7, కళ్యాణదుర్గం నుంచి 3, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 25 నామకరణం మార్పునకు సంబంధించి ప్రతిపాదనలు రావడం జరిగిందని, వాటిని ఎన్నికల కమీషన్ కు పంపిస్తామన్నారు. పోలింగ్ స్టేషన్ల స్థానాల మార్పు, నామకరణం మార్పు, సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించి ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వారి పార్టీల అభ్యర్థులకు పోలింగ్ స్టేషన్ల స్థానాల మార్పు, నామకరణం మార్పు, సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించి పూర్తిగా తెలియజేయాలన్నారు. అలాగే ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం సార్వత్రిక ఎన్నికల కోసం అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలు & స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు రోజుల్లోపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు జేఎన్టీయూని సందర్శించి కౌంటింగ్ కేంద్రాలు & స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలించాలని, ఏవైనా సూచనలు అవసరమైతే తెలపాలన్నారు. ఈ సందర్భంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్ల స్థానాల మార్పు, నామకరణం మార్పు, సహాయక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఈఆర్ఓలు జి.వెంకటేష్, రాణి సుస్మిత, వి.శ్రీనివాసులు రెడ్డి, కరుణకుమారి, రాంభూపాల్ రెడ్డి, వి.శ్రీను, వసంత బాబు, వైఎస్సార్సిపి ప్రతినిధి సోమశేఖర్ రెడ్డి, టిడిపి ప్రతినిధి చెరకుతోట పవన్ కుమార్, బిజెపి ప్రతినిధి ఈశ్వర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎంఎండి.ఇమామ్, ఆమ్ ఆద్మీ పార్టీ మసూద్ వలి, బీఎస్పీ అంజయ్య, సిపిఎం బాలరంగయ్య, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, అనంతపురం, తాడిపత్రి తహసీల్దార్ లు శివరామిరెడ్డి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img