Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అభ్యుదయ మార్గదర్శి రామోజీరావు

కాలమిస్ట్ నల్లాని రాజేశ్వరి సంతాపం

విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: “ఈనాడు” సంస్థల ఛైర్మన్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు (88) మృతి అత్యంత బాధాకరమని ప్రముఖ కాలమిస్ట్, సామాజిక కార్యకర్త, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అభ్యుదయ మార్గదర్శిగా చిరస్మరణీయుడిగా చరిత్రలో నిలుస్తారని కొనియాడారు. తాను వ్యక్తిగతంగా ఆయనను కలిసిన 2019 సెప్టెంబర్ 16 వ తేదీ తన జీవితంలో మరచిపోలేని రోజన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఛైర్మన్ ఛాంబర్ లో దాదాపు ఇరవై నిమిషాల పాటు జీవిత ప్రస్థానం గురించి పలు విషయాలు తెలియజేసి స్ఫూర్తినింపారన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, బాలికావిద్య, మహిళా సాధికారత వంటి అంశాలపై “ఈనాడు” దినపత్రికలో తాను రాసిన వ్యాసాల సంపుటి “సాధికారత” పుస్తకాన్ని ఆయనకు స్వయంగా అందజేయడం తన అదృష్టమన్నారు.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికి, లెక్క చేయకుండా ఒక లక్ష్యంతో పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరుకొని తన సంస్థలను అత్యున్నత శిఖరాల్లో అగ్రగామిగా నిలబెట్టిన మహావ్యక్తి రామోజీరావు అన్నారు. రామోజీరావు లాంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆమె గుర్తు చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రజల కోరిక మేరకు ఆయా ప్రాంతీయ భాషల్లో ఈనాడు దినపత్రికతో పాటు ఈటీవీ ప్రసార మాధ్యమాలు , రామోజీ గ్రూప్ సంస్థలు, ప్రియా సంస్థల పేరుతో పచ్చళ్ళు, వంట నూనెలు, దేశంలోనే అత్యంత పర్యాటక కేంద్రంగా రామోజీ ఫిలింసిటీ వంటి వాటినీ స్థాపించి ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. సామాన్య ప్రజలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా మార్గదర్శి లాంటి చిట్ ఫండ్స్ ను స్థాపించి ప్రజలకు అండగా నిలిచి ప్రజల రారాజుగా చరిత్రలో నిలిచిపోతారనీ కొనియాడారు. అయన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకుడు గొప్ప వ్యక్తి గా ప్రపంచ పటంలో నిలిచిపోతారని కొనియాడారు. రామోజీ రావు లాంటి మహనీయులు మనకు గొప్ప ఆదర్శవంతులుగా నిలుస్తారని అలాంటి వ్యక్తులు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img