Friday, May 31, 2024
Friday, May 31, 2024

చల్లటి మజ్జిగతో దాహం తీరుస్తున్న విశ్రాంత ఉద్యోగులు


విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం పట్టణంలోని సర్వజన ఆసుపత్రి ఎదుట ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో విశ్రాంత అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగ మిత్రులు , విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి రాజశేఖర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అధికారులు యు ఎస్ ఎన్ రాజు, యు,చంద్రశేఖర్ రెడ్డి శ్రీరాములు,దివాకర్ సుందర్ రాజు ఒక మిత్ర బృందంగా వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి మండుటెండల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చినటువంటి వారికి చల్లటి మజ్జిగను బుధవారం అందజేశారు. రోగుల యొక్క బంధువులు అలాగే రోడ్డున పోతున్నటువంటి ప్రజలు వీరు ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోవడంతో పట్టణంలో వివిధ పనుల నిమిత్తం వచ్చినటువంటి ప్రజలు తాగు నీటి కోసం దాహంతో అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో వీరు ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ కేంద్రం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నది పలువురు అభినందించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగులు మాట్లాడుతూ… ఈ మజ్జిగ కేంద్రంలో రోజుకు 500 లీటర్లు మజ్జిగ ప్రజలకు పంచుతున్నట్లు ఈ మజ్జిగ కేంద్రానికి దాదాపు 600 మంది వస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఒక నెల నుండి ఈ మజ్జిగ కేంద్రాన్ని నడుపుతున్నట్లు మరో రెండు నెలలు పాటు ఎండలు తగ్గుముఖం పట్టేదాకా ఈ మజ్జిగ కేంద్రాన్ని నడుపుతున్నట్లు వారు తెలిపారు. మరికొందరు దాతలు ముందుకు వస్తే మరింత విజయవంతంగా ఈ మజ్జిగ కేంద్రాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img