Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పకడ్బందీగా కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి


విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రత్యేక ఓటరు సవరణ జాబితా కార్యక్రమం- 2024 కింద చేపడుతున్న కంటినేషన్ అప్డేషన్ లో భాగంగా ఫామ్- 6, 7, 8 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి తెలియజేశారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుది ఓటర్ల జాబితా విడుదల అనంతరం కంటినేషన్ అప్డేషన్ లో భాగంగా ఫామ్- 6, 7, 8 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ఫామ్- 6, 8కి సంబంధించి ఎలాంటి సమస్య లేదని, ఫామ్- 7కి సంబంధించి డెత్ కేసులు, డూప్లికేట్ కేసులను పరిశీలన చేసి పరిష్కరిస్తున్నామన్నారు. ఎపిక్ కార్డుల జనరేషన్ కి సంబంధించి వచ్చే మంగళవారం నాటికి జిల్లాకు 2.30 లక్షల కార్డులు రానున్నాయని, వాటిని పోస్టాఫీస్ ద్వారా ఓటర్లకు అందజేస్తామన్నారు. ఎపిక్ కార్డులను సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అనేది పరిశీలన చేయడం జరుగుతోందన్నారు. హోమ్ ఓటింగ్ కు సంబంధించి 80 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు, పిడబ్ల్యుడి ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేది క్షేత్రస్థాయిలో బిఎల్వోల చేత గుర్తించడం జరుగుతోందని తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ కు సంబంధించి 1,500 ఓటర్ల సంఖ్య దాటిన చోట ఈ వారంలోపు నూతన పోలింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ జాబితాను తయారు చేస్తున్నామని, గత ఎన్నికల్లో 90 కన్నా ఎక్కువ ఓటు నమోదు, 10 శాతం కన్నా తక్కువ ఓటింగ్ నమోదు, 75 శాతం ఒక అభ్యర్థికి ఓటు వచ్చినా, తదితర ఏడు రకాల పారామీటర్స్ తో పోలింగ్ స్టేషన్స్ గుర్తించడం జరుగుతోందన్నారు. క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ తయారు చేయాలని సంబంధిత ఆర్వో, ఎస్డిపిఓ, ఏఆర్ఓ, సిఐలకు ఆదేశించామని తెలిపారు. జంక్ క్యారెక్టర్స్ కు సంబంధించి వచ్చే శనివారంలోగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతివారం జరిగే సమావేశాలను ఉపయోగించుకోవాలన్నారు. కింది స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో నిర్వహిస్తున్నారా లేదా అనేది పరిశీలించాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, టిడిపి ప్రతినిధి చెరకుతోట పవన్ కుమార్, వైఎస్సార్సిపి ప్రతినిధులు కేవీ రమణ, శ్రీనివాసులు, బిజెపి ప్రతినిధి ఈశ్వర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎంఎండి.ఇమామ్, సిపిఐఎం బాల రంగయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ మసూద్ వలి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎలక్షన్ సెల్ సీనియర్ అసిస్టెంట్ శ్యాముల్, తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img