Friday, April 19, 2024
Friday, April 19, 2024

ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ

విశాలాంధ్ర -పామిడి : ఛత్రపతి శివాజీ మహారాజ్‌ 344వ వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు శివాజీ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పామిడి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల పక్కన ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంజునాథ్ రావు మాట్లాడుతూ ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ అని కొనియాడారు యువత శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భావసర్ క్షత్రియ సమాజ్ సభ్యులు శ్రీనివాసరావు, దీపక్, అశోక్, రవి, హరీష్, నందు, నారాయణ,ప్రవీణ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు….

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img