Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలి

ఇంచార్జి జిల్లా కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లో ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం ఏర్పాట్లను ఇంచార్జి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి చేపట్టే ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ కోసం ఎన్ని టేబుల్స్, కౌంటర్స్ ఏర్పాటు చేసుకోవాలి, తదితర వివరాలను ఆరా తీశారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ కోసం పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ జి.వెంకటేష్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, తహశీల్దార్ శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img