Friday, May 31, 2024
Friday, May 31, 2024

డిగ్రీ పరీక్షా ఫలితాలలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రభంజనం

విశాలాంధ్ర – ధర్మవరం : ఎస్కే యూనివర్సిటీ ప్రకటించిన మొదటి మూడవ ఐదవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని, మంచి ఉత్తీర్ణత సాధించడం జరిగిందని పట్టణంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారని కరెస్పాండెంట్ చాంద్ భాషా, ప్రిన్సిపాల్ ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్సీ నందు పి. దీప్తి 95 శాతము, పి.జ్యోతి 92 శాతం, జి. గౌతమి, జి. మహేశ్వరి, ఎస్. ఫరీద్ తాజు 91 శాతము, కే. స్వాతి 89 శాతము, కే. భారతి 87 శాతము, ఎస్. సౌమ్య ,జి. ఉషాలు 86 శాతము, కే. సునీత టీ. పూజిత 85 శాతము, ఎస్, చందు, జే.దివ్యశ్రీ 84 శాతము, జే. దివ్యశ్రీ, ఎస్. మేఘన83 శాతము, ఈ. భార్గవ సాయి, ఎం. హేమలత 82 శాతము, సి .జయంత్, సి. జయశ్రీ, డి. కుసుమ 81 శాతం, ఎస్. అనిత, ఎస్. నహిద 85 శాతము, వై. యశస్విని 84 శాతము, పి. కళావతి, సి. జయ కృష్ణ 82 శాతం, అదేవిధంగా బీకాం బీబీఏ గ్రూప్ నందు ఎం. సంతోష్ కుమార్ 91 శాతము, ఏ. గౌతమ్ గంభీర్ 85 శాతము, ఈ. నిహారిక 84 శాతం, కే. త్రిలోకనాథ్ 83 శాతం, ఎం, మనీషా 82 శాతము, పి. శ్రీనివాసులు, ఎం. జయ సాయినాథ్, ఎం. కరుణ్ కుమార్ రెడ్డి 81 శాతం, ఎస్. సాహి ముస్కాన్, ఎన్. మురళి 80 శాతం తోపాటు మరి ఎందరో మంచి ఫలితాలను సాధించి కళాశాలకు తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంచి పేరుతో పాటు గుర్తింపు తీసుకురావడం పట్ల కరెస్పాండెంట్ చాంద్ బాషా ప్రిన్సిపాల్ ఫణి కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రతిప గణపరిచిన వారందరిని అభినందించి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img