విశాలాంధ్ర – కదిరి : వచ్చే నెల 1వ తేది (మంగళవారం) నాటి పౌర్ణమి కి అరుణాచల పుణ్యక్షేత్ర గిరిప్రదక్షిణ చేసేందుకు వీలుగా కదిరి డిపో నుండి (31.7.23) సోమవారం మధ్యాహ్నం: 12.00 గంటలకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ బి.మైనోద్దిన్ తెలిపారు. పెద్దలకు రానుపోను రూ.860.00 లు ఉంటుందన్నారు. 30 మందితో భక్తులు కోరినచో వారి ఊరికే స్పెషల్ బస్సు పంపిస్తామని తెలిపారు. భక్తాదులు ముందస్తుగా తమ టిక్కెట్టును బస్టాండు లో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ కౌంటర్ వద్ద నగదు చెల్లించి,ఫోన్ పేద్వార టిక్కెట్టు పొందాలనుకునేవారు ఫోన్: 9052537054 కి సప్రదించవచ్చునని డిఎం తెలిపారు.