— జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు
పరేడ్ మైదానంలో ఉచితంగా ఈవెంట్స్ శిక్షణలో పాల్గోన్న ఎస్సై/కానిస్టేబుల్
ప్రిలిమ్స్ అర్హత అభ్యర్థులతో ఎస్పీ ముఖాముఖి
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఉద్యోగం తప్పకుండా సాధిస్తామనే దృఢ సంకల్పంతో సాధన చేస్తే విజయం తథ్యమని జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎస్సై/కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అర్హత అభ్యర్థులకు జిల్లా పోలీసుశాఖ ఉచితంగా సుశిక్షితులైన పోలీసు సిబ్బందిచే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయిస్తున్న విషయం తెలిసిందే. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు. లక్ష్యం ఎలా చేరాలి, కఠోర శ్రమ, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లి ఎలా ఉద్యోగం సాధించవచ్చో దిశానిర్ధేశం చేశారు. త్వరలో జరుగనున్న ఈవెంట్స్ లో ఎలా సక్సెస్ కావచ్చో పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ తో పాటు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఎ.హనుమంతు వెళ్లారు.