Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మున్సిపల్ వైస్ చైర్మన్ ల ప్రమాణ స్వీకారోత్సవం..

ప్రిసైడింగ్ ఆఫీసర్.. తిప్పే నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు గురువారం ప్రిసైడింగ్ ఆఫీసర్ తిప్పే నాయక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నల ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్-1, మున్సిపల్ వైస్ చైర్మన్బి2 యొక్క ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల జయరాం రెడ్డి(2 వ వార్డ్) కౌన్సిలర్ను,మూడో వార్డుకు చెందిన శంకర తేజేశ్వర్ ప్రతిపాదించగా, 14వ వార్డుకు చెందిన గజ్జల శివయ్య మున్సిపల్ వైస్ చైర్మన్బి1గా బలపరిచారు. తదుపరి ఎస్. శంషాద్ బేగం (38 వవార్డ్)ను 11వ వార్డ్ కౌన్సిలర్ అత్తర్ జిలాన్ భాష ప్రతిపాదించగా, తొమ్మిదవ వార్డుకు చెందిన మాసపల్లి సాయికుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్-2 గా బలపరిచారు. తదుపరి ఎన్నికల చట్టం ప్రకారం వీరి ఇరువురికి ఎవరు పోటీ రాకపోవడంతో ఏకగ్రీవంగా ఇద్దరిని ఎంపిక చేసినట్లు ప్రిషిడింగ్ ఆఫీసర్, ఆర్డీవో తిప్పే నాయక్ అధికార పూర్వకంగా ప్రకటించారు. అనంతరం ప్రీ సైడింగ్ ఆఫీసర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి లు మున్సిపల్ వైస్ చైర్మన్ లకు పుష్ప గుచ్చాలు ఇచ్చి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా వైస్ చైర్మన్ లకు పుష్పగుచ్చాలతో పాటు శాలువాతో ఘనంగా సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత ఈ వైస్ చైర్మన్ ఎంపిక కొరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ధర్మవరం మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో, ఇదివరకు చైర్మన్, వైస్ చైర్మన్ గా విధులు కొనసాగించిన వారి బాటలోనే ప్రస్తుత వైస్ చైర్మన్ కూడా నడుస్తూ, అటు ప్రజలకు సమస్యలను పరిష్కరిస్తూ, మున్సిపాలిటీకి మంచి గుర్తింపు తేవాలని తెలిపారు. ఇప్పటికే ధర్మవరం మున్సిపాలిటీకి ప్రభుత్వం ఎన్నో నిధులు ఇచ్చి,అభివృద్ధి బాటలో నడిపించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించుటలో వైస్ చైర్మన్ ల యొక్క కృషి ఎంతో అవసరంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆనంద్, టిపిఓ. సాయిప్రసాద్, మున్సిపల్ ఈఈ సత్యనారాయణ, డి ఈ వన్నూరు స్వామి, కృష్ణారావు, సుధారాణి మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్లు లింగం నిర్మల, భాగ్యలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెనుజూరు నాగరాజు, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img