Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కౌంటింగు ప్రశాంతంగా ముగిసేందుకు భద్రతా చర్యలు చేపట్టిన ప్రతీఒక్కరికీ కృతజ్ఞతలు

జిల్లా ఎస్పీ గౌతమిసాలి
విశాలాంధ్ర – అనంతపురం : కౌంటింగు ప్రశాంతంగా ముగిసేందుకు భద్రతా చర్యలు చేపట్టిన ప్రతీఒక్కరికీ జిల్లా ఎస్పీ గౌతమిసాలి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో నిన్న కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది మరియు కేంద్ర, రాష్ట్ర బలగాలతో ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఎస్పీ గారు సమావేశమయ్యారు. అందరూ సమిష్టిగా కష్టపడటం వల్లనే జిల్లాలో కౌంటింగు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రతీ ఒక్కరు అంకితభావం, చిత్తశుద్ధితో పని చేయడం ముదావహం అన్నారు. పోలింగు తర్వాత తలెత్తిన ఘర్షణలు, అల్లర్ల వల్ల అందరి దృష్టి జిల్లాపైన ఉండేదన్నారు. ఎన్నికలలో ఆఖరు మరియు కీలక ఘట్టమైన కౌంటింగు ప్రశాంతంగా ముగించేలా ఉత్తర్వులు జారీ కావడంతో పాటు అదనంగా బలగాలు రావడం జరిగిందన్నారు. అయినప్పటికీ… కౌంటింగు రోజున అవాంఛనీయ ఘటనలు తలెత్తే అవకాశం ఉండొచ్చని అనుకున్నారు. అయితే ప్రశాంతంగా ముగియడం శుభ పరిణామమన్నారు. ఇదే స్ఫూర్తితోనే మరికొన్ని రోజులు శ్రమించి జిల్లాను ప్రశాంతంగా ఉంచుదామని పిలుపునిచ్చారు. అదేవిధంగా.. కౌంటింగు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసమావేశంలో పలువురు డీఎస్పీలు, సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది మరియు కేంద్ర, రాష్ట్ర బలగాల పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img