Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను పకడ్బందీగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఈఎస్ఎంఎస్ (ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం)ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈఎస్ఎంఎస్ (ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం) అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈఎస్ఎంఎస్ పరిధిలో ఖచ్చితంగా డేటా అప్డేషన్ ఎప్పటికప్పుడు జరగాలన్నారు. జిల్లాలో 20 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, 3 అంతర్ జిల్లా చెక్ పోస్టులు, 4 డైనమిక్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, చెక్ పోస్టుల వద్ద సీజర్స్ నమోదు పక్కాగా జరగాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ కు సంబంధించి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలన్నారు. వాటికి సంబంధించిన రిపోర్టులను ప్రతిరోజు అందించాలని సెబ్, ఎక్సైజ్, పోలీస్ అధికారులను, ఆర్ఓలను ఆదేశించారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద, రైల్వే స్టేషన్ల పరిధిలో, బస్టాండ్ లలో క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని ఎఫ్.ఎస్.టి టీమ్లు ఎంత మేరకు సీజర్స్ నమోదు చేశారు అనేది పరిశీలించాలని, సీజర్స్ నమోదుపై ఎఫ్.ఎస్.టి టీమ్ లకు ఆర్ఓలు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్క వివరాలను ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. సీజర్స్ నమోదుపై నోడల్ అధికారులు నిత్యం మానిటర్ చేయాలని, ఎక్కడ సీజర్స్ నమోదైనా, ఎఫ్ఐఆర్ నమోదైనా ఈఎస్ఎంఎస్ లో నమోదు చేయాలన్నారు. పూర్తి స్పష్టతతో ఖచ్చితమైన వివరాల నమోదు ఉండాలని, ఇందుకు సంబంధించి రిజిస్టర్లను మైంటైన్ చేయాలన్నారు. అకౌంటింగ్ టీమ్లను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంకు సంబంధించి ఎలాంటి సమన్వయ లోపం లేకుండా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారులు జి.వెంకటేష్, రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, రాంభూపాల్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ శేషాద్రి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ అధికారి వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, ఎల్డిఎం సత్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.*

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img