Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మెడికల్ మాఫియా ను నియంత్రించడం లో ప్రభుత్వం పూర్తి విఫలం..

ప్రైవేట్ హాస్పటల్ స్కానింగ్ సెంటర్లు, రక్త పరీక్షాల రక్తపరీక్ష కేంద్రాల దోపిడిని అరికట్టాలి

మెడికల్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం..

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా మెడికల్ మాఫియాకు అడ్డాగా తయారయిందని మెడికల్ మాఫియాను నియంత్రించవలసిన అధికారులే లంచాలకు మత్తులో మాఫియాని పెంచి పోసిస్తునరనిా విమర్శలు వస్తున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే మెడికల్ మాఫియాని అనంతపురం అడ్డాగా మారిందని అఖిలభారత యువజన సమాఖ్య అనంతపూర్ నాయకులు సోమవారం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మోహన్ కృష్ణ మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో మెడికల్ మాఫియా అడ్డాగా మారిపోయిందని, వ్యాధిగ్రస్తుల రోగాన్ని బట్టి ఇష్టానుసారంగా ప్రైవేట్ ఆస్పత్రిలో విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటున్నారని, ఎమర్జెన్సీని బట్టి డాక్టర్ నియామకాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. సర్జరీ విఫలం అయితే డబ్బులు కట్టేంతవరకు పేషంట్ డెడ్ బాడీని హాస్పిటల్ లో పెట్టుకుంటున్నా దారుణమైన పరిస్థితి అనంతపురం జిల్లాలో చూస్తున్నామని ఆవేదన చెందారు. నాసిరకం మందులను ఒకే రకమైన పేర్లతో అక్షరాలు మార్చి పది రూపాయల విలువ చేసే ముందులను వందల రూపాయలకు అమ్మకం చేస్తున్నారని అదేవిధంగా హాస్పిటల్స్ యాజమాన్యాలు డాక్టర్లు క్లినిక్లు, స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ల పేర్లతో ప్రజల రక్తాన్ని జలగల్లా పట్టిపీడిస్తున్నాయని అవసరం లేకపోయినా అనేక రకాల టెస్టుల పేర్లతో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది రూపాయలు దండుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరల పట్టిక పెట్టవలసి ఉండగా నిబంధనను కాలరాశి 200 రూపాయల టెస్టును 2,000 రూపాయలకు చేయడంతో పాటు మా దగ్గరే టెస్టులు చేపించుకోవాలి, మా దగ్గరే మందులు కొనాలి అంటూ ఫార్మా కంపెనీల నుండి ఏజెన్సీల నుండి ఎక్కువ కమిషన్ వచ్చేటటువంటి మందులను మాత్రమే విక్రయిస్తూ సుప్రీంకోర్టు మరియు కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి గైడ్లైన్సులు పక్కనపెట్టి ఎక్కువ డోస్ ఉన్నటువంటి మందులను అమ్మడంతో పాటు ప్రాణభీతితో హాస్పటల్లో వచ్చిన పేద ప్రజల ఆశని అవకాశంగా తీసుకుని రక్తం దగ్గర నుండి అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారన్నారు. అనేక హాస్పిటల్స్ లాడ్జీలకంటే దారుణంగా సింగిల్ బెడ్ డబల్ బెడ్ కామన్ హాల్ ఏసి రూమ్ లో పేర్లతో 1200 నుండి పదివేల వరకు రూమ్ బిల్లులు వసూలు చేస్తూ వ్యాపారాలు చేస్తున్నాయని పర్యవేక్షించి నియంత్రించవలసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాస్పిటల్స్ ల్యాబ్లు, మెడికల్ షాపుల యాజమాన్యాలు ఇచ్చే లంచాలకు కక్కుర్తి పడి ప్రజల జీవితాలను గాలికి వదిలేస్తున్నారని పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మెడికల్ మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా సహాయకార్యదర్శి రాకెట్ల రాము, నగరఅధ్యక్షుడు శ్రీనివాస్, నగర ఆఫీస్ బ్యారెరలు లికిల్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img