Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అలీ సాహెబ్ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలి

జిల్లా కలెక్టర్ కు వినతులు…
వినతి పత్రాన్ని ఆర్డిఓ అందజేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురమునగరం రెండవ డివిజన్ ఎల్లమ్మ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన 6 మంది గుత్తి హైవే బాట్లో కొత్తపల్లి దగ్గర కార్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో రామకృష్ణారెడ్డికి సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనంతపురము నగరంలో రెండవ డివిజన్లోని ఎల్లమ్మకాలనీకి చెందిన అలీ సాహెబ్ కుటుంబం గుత్తి హైవే బాట్లో కొత్తపల్లి దగ్గర కార్ యాక్సిడెంట్ లో 6 మంది కుటుంబ సభ్యులు మరణించడం జరిగింది. వీరు పెద్ద కుమారుడు పెళ్లి బట్టల కొనడానికి హైదరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణం అనంతపురము వస్తున్న తరుణంలో గుత్తి హైవేలో యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. హృదయ విధారకమైన సంఘటన, కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న అలీ సాహెబ్ ,(58) పెద్ద కుమారుడు పెళ్ళికొడుకు ఫిరోజ్ బాషా, (30) ఫిరోజ్ అన్న కుమారులు అయాన్, (6) మహమ్మద్ అయాన్, (3) అలీ సాహెబ్ పెద్ద కోడలు రెహానా బేగం, (40) అలీ సాహెబ్ వదిన జాహిద భాను (40) వీరందరూ ప్రమాదంలో మరణించడం అందరికీ తెలిసిందే అన్నారు. వీరి కుటుంబంలో విషాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి అన్నారు.అలీ సాహెబ్ భార్య మున్ని, మరియు అలీ సాహెబ్ తమ్ముని కుమారులు మహమ్మద్ గౌస్, ఎం. బి. ఏ, షేక్. మన్సూర్ ఏం.బి. ఏ, లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనవి చేశారు. ప్రస్తుతం వీరు అద్దెనివాసంలో ఉంటున్నారు. ప్రభుత్వం వీరికి సొంత ఇల్లు కేటాయించి మృతి చెందిన ప్రతి ఒక్కరికి 10 లక్షల చొప్పున 60 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కు అయిన అలీ సాహెబ్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబంలో వారిని చూసుకోవడానికి ఎవరు లేని పరిస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వం వీరి కుటుంబం పైన దయవుంచి వారిని ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున వినతి పత్రంలో కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.లింగమయ్య, అనంత నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి అలిపిర, బాధితుడు మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img