Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

చేనేత పరిశ్రమ కాపాడుతూ, చేనేత పాలసీని వెంటనే అమలు చేయాలి

ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు

విశాలాంధ్ర – ధర్మవరం : చేనేత పరిశ్రమను కాపాడుకుంటూ, చేనేత పాలసీని వెంటనే అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ గత ఆరు నెలల నుంచి చేనేత పరిశ్రమ తీవ్రంగా సంక్షోభానికి గురి కావడం జరిగిందని,ఏదైనా విపత్తు వస్తే, నిధులు కేటాయించి, ఎలా ఆదుకుంటారో? అలాగే చేనేత విపత్తు వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని, వస్త్రాలను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నేడు చేనేత పరిశ్రమ అడ్డం పెట్టుకొని చేనేత రిజర్వేషన్ చట్టమును అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా పవర్లూమ్స్ లో చీరలు తయారు చేస్తున్నారని తెలిపారు. నేటి ముఖ్యమంత్రి అన్ని విషయాలు మాట్లాడతారే కానీ, చేనేత పరిశ్రమల గురించి ఎందుకు మాట్లాడడం లేదని వారు మండిపడ్డారు. చేనేత కార్మికుని కుటుంబానికి ఒక లక్ష రూపాయల రుణం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధర్మారం నుంచి పట్టుచీరలను ఇతర రాష్ట్రాల వారు తీసుకెళ్తున్నారే కానీ డబ్బులు ఇవ్వకపోవడం దారుణం కాదా? అని వారు ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి వస్త్ర పరిశ్రమపై 3 వేల కోట్లు వసూలు చేస్తోందని, మరి ఇందులో 1000 కోట్లు చేనేత పరిశ్రమకు కేటాయిస్తే పరిశ్రమ సంక్షోభము నుండి బయటపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదినారాయణ, వెంకటస్వామి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img