Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని 22వ వార్డులోని అర్బన్ హెల్త్ సెంటర్లో తల్లిపాల వారోత్సవానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం ఐ సి డి ఎస్ వారు ప్రదర్శించిన వివిధ కాయగూరలు, వాటితో చేసిన తినుబండారాలు, అంగన్వాడి కేంద్రాలు నిర్వహించే పద్ధతులను వారు పరిశీలించారు. తదుపరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల ఓపి వార్డును, ఫార్మసీ వార్డులు పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న రోగులను అడిగి వసతులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని వారు ఆరా తీశారు. తదుపరి మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు ఒక ఆశీర్వాదం అని, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకు సంపూర్ణ ఆహారం అవుతుందని, అదేవిధంగా తల్లిపాలు శిశువును నిమోనియా, అతిసారా వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని తెలిపారు. తల్లిపాలు పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు. తల్లిపాలు అధిక రక్తపోటు మధుమేహం, శూలకాయం, వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని, క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుందని, తల్లిపాలు తల్లి, బిడ్డ మధ్య బంధాన్ని మరింత పెంచుతుందని తెలిపారు. బిడ్డ శ్రేయసుకు ఉపాయము, తల్లికి ప్రయోజనాలు అధికంగా ఉంటాయని తెలిపారు. తల్లిపాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి, సంపూర్ణ పోషణ లభిస్తుందని తెలిపారు. తల్లిపాలు బిడ్డకు జీవ రక్షక బిందువులుగా ఉంటుందని, తల్లిపాలు అమృతం లాంటిదని, బిడ్డను అనేక రోగాల నుండి సురక్షితంగా కాపాడుతుందని తెలిపారు. బిడ్డ యొక్క సంపూర్ణ మానసిక వికాసం పుట్టిన మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం వారు బ్రోచర్స్ను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తారని, గర్భవతులు బాలింతలు తమ ఆరోగ్యాలను చక్కగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, టిడిపి నాయకుడు కమతం కాటమయ్య, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి డిస్టిక్ ఆఫీసర్ నాగేంద్ర నాయక్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సెల్వియా సల్మాన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత, జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ బాబా ఫక్రుద్దీన్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గర్భవతులు బాలింతలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img