Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దేశ ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలి…

స్త్రీ లేకపోతే సమాజం లేదు …

ప్రధానమంత్రి మహిళా సాధికారిక గురించి మాట్లాడటం సిగ్గుచేటు …

సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : మణిపూర్ సంఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం పై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మణిపూర్ మారణ కాండపై బిజెపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, మానవహక్కుల వేదిక సభ్యులు చంద్రశేఖర్, టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివ బాల, హుమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు షేక్ మీర్, అన్నపూర్ణ, సిపిఐ రైతు సంఘం నాయకులు జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఏ ఐ టి యూ సి రాజేష్ గౌడ్, ఐద్వా నాయకురాలు రామాంజునమ్మ , పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ… మణిపూర్ సంఘటనపై రాష్ట్రంలో వైకాపా, టిడిపి, జనసేన నాయకులు మాట్లాడకపోవడం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడుతున్నట్లుగా తెలుస్తోందన్నారు. దేశ రాష్ట్రపతి ఒక దళిత మహిళ ఉండుకొని మణిపూర్ సంఘటనపై మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రాజకీయాల పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. సి పి ఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… ఒకపక్క మణిపూర్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువతుండగా మరోపక్క అజాద్ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహిళల సాధికారిక గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. స్రీ లేకపోతే సమాజం లేదన్న విషయాన్ని తెలిసి ఉండి కూడా మహిళల పట్ల జరుగుతున్న అగత్యాలపై రాష్ట్ర ప్రధానికి పశ్చాత్తాపం లేదన్నారు. మణిపూర్ లోని అటవీ ప్రాంతంలో ఉన్న సంపదను అక్కడ నివసిస్తున కుగ్గిలను పారదోలడానికి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. అటవీ సంపదనంతా కార్పొరేట్ వ్యవస్థకు కట్టపట్టడానికే కుట్ర పన్నుతున్నారన్నారు. హర్యానా రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తోందన్నారు. బిజెపి పాలన గద్దె దింపేంతవరకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇతర మహిళా నాయకురాలు మాట్లాడుతూ… దేశంలో మహిళలకు అర్థరాత్రి కాదు పట్టపగలే భద్రత లేదన్నారు. రాతిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని పూజిస్తాము కానీ సజీవంగా ఉన్న మహిళలపై దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రతి మహిళ తనలోని ఉన్న నైపుణ్యాన్ని ఉపాధిగా చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img