Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సింగంపల్లి తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆత్మకూరు మండలం సింగంపల్లి తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మండలం సింగంపల్లి తండాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పర్యటించి స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నాడు-నేడు పనులు, ఉపాధి హామీ, హౌసింగ్ పనులను, హాస్పిటల్, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాల పనితీరు గురించి, ఇతర అన్ని పథకాలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగపరమైన హక్కులకు విఘాతం కలగకుండా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలో మా దృష్టికి వచ్చిన సమస్యలను దశలవారీగా ఒక్కొక్కటి పరిష్కరించడం జరుగుతుందన్నారు. గిరిజనులకు ఏదైనా ఆపద, సమస్య వస్తే పరిష్కరించేందుకు కమీషన్ కృషి చేస్తుందన్నారు. అధికారులు మానవీయ కోణంలో సహృదయంతో ప్రజలకు మంచి చేయడానికి, వారి సంక్షేమానికి, జీవన ప్రమాణాలు పెరిగేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న అధికారంలోకి వచ్చాక నేరుగా 2 లక్షల 53 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలకు జమ చేయడం జరిగిందని, ఇది దేశంలో ఎక్కడా జరగలేదని, అది ఒక్క జగనన్నకే సాధ్యమైందన్నారు. జగనన్న సీఎం అయ్యాక గిరిజన సంక్షేమం కోసం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. నాడు- నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల, రూపురేఖలు మారుస్తున్నారని, 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్నారని, విద్య, వైద్యం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జగనన్న ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గ్రామంలో కొత్తగా స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నూతన ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలన్నారు. గ్రామంలో 60 లక్షల రూపాయలతో మంజూరైన ఓహెచ్ఎస్ఆర్ ను వెంటనే గ్రౌండ్ చేసి త్వరగా నిర్మాణం చేపట్టాలన్నారు. గ్రామానికి దూరంగా ఉన్న ఎస్టీ కుటుంబాలకు త్రాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. మంజూరుకాని కొత్త గృహ నిర్మాణాలను ప్రతిపాదించాలన్నారు. గ్రామంలో నూతన దేవాలయ నిర్మాణానికి టీటీడీ వారికి ప్రతిపాదనలు పంపించాలని పేర్కొన్నారు. గ్రామం నుంచి కూడేరు వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేయాలన్నారు. ఇప్పటికే సాగు చేస్తున్న అటవీ భూముల యందు ఎస్టీ రైతులను గుర్తించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, తహసీల్దార్ పరమేశ్వర స్వామి, ఎంపీడీవో దశరథ రాముడు, సర్పంచ్, ఎంపీటీసీ, మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img