Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

ఏర్పాట్లన్నీ ముందుగా పూర్తి చేయాలి
ఎన్నికల కమీషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలి
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా వారు మార్చి నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికలు – 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను సజావుగా చేపట్టేందుకు ఏర్పాట్లన్నీ ముందుగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటారన్నారు. ఏఆర్ఓగా సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డిని నియమించడం జరిగిందని, నామినేషన్లకు సంబంధించిన మెటీరియల్ మొత్తం పూర్తిగా చదివి ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకోసం అన్ని విధాలా సన్నద్ధం కావాలన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అభ్యర్థి నామినేషన్ దరఖాస్తు చేసిన రోజే స్క్రుటిని ప్రక్రియ చేపట్టాలని, ఏవైనా వివరాలు తక్కువగా ఉంటే వెంటనే అభ్యర్థులకు తెలపాలన్నారు. ఈ ప్రక్రియ కోసం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అంజన్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img