Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్టు

సుమారు రూ. 8 లక్షల విలువ చేసే 12 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ ఆర్. విజయభాస్కర్ రెడ్డి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ముగ్గురు చైన్ స్నాచర్లను జిల్లా స్పెషల్ బ్రాంచి, సిసిఎస్ పోలీసులతో కలసి వేర్వేరుగా అరెస్టు చేసిన గార్లదిన్నె, అనంతపురం రూరల్ పోలీసులు
సుమారు రూ. 8 లక్షల విలువ చేసే 12 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ ఆర్. విజయభాస్కర్ రెడ్డి గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనంతపురం సిసిఎస్ & గార్లదిన్నె పోలీసులు చేసిన అరెస్టు, స్వాధీనం వివరాలు…
1 ఏనుముల మారుతి ప్రసాద్, వయస్సు 30 సం.లు, వెంకటాంపల్లి గ్రామం, కంబదూరు మండలం
2.మూడవత్ రామ్ల నాయక్, వయస్సు 34 సం.లు, వెంకటాంపల్లి గ్రామం కంబదూరు మండలం.
ఈ ఇద్దరు నిందితులు మంచి స్నేహితులు. క్రికెట్ బెట్టింగ్, పేకాట, తదితర వ్యసనాలకు ఆలవాటుపడి అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చడానికి మరియు వ్యసనాల కొనసాగింపు కోసం ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలని భావించారు. చైన్ స్నాచింగులు పాల్పడాలని వ్యూహరచన చేసుకున్నారు. శివారు ప్రాంతాలు, జన సంచారం లేని ప్రదేశాలలో మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగులకు పాల్పడుతూ వచ్చారు. ఈ ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్లి అనంతపురము, గార్లదిన్నె, తదితర ప్రాంతాలలోని ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగులకు పాల్పడ్డారు. ఊరి బయట, జన సంచారం లేని ప్రాంతాలలో మహిళలను అనుసరించడం, చుట్టూ పరిస్థితులను పరిశీలించడం, అనువైన సమయంలో మహిళల మెడలో ధరించిన చైన్లను లాక్కెళ్లారు. ఇలా… దొంగలించిన బంగారు ను తక్కువ ధరకే విక్రయించి వచ్చిన సొమ్మును జల్సాలకు వినియోగించారు.
గత ఏడాదిన్నర కాలంలో అనంతపురం 2 టౌన్, 3 టౌన్, తాడిపత్రి, ధర్మవరం, బత్తలపల్లి, కర్నాటక రాష్ట్రం బళ్లారి, సింధనూరు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేశారు. వీరి పై గతం లో అనంతపురము ఒన్ టౌన్, టూటౌన్, తాడిపత్రి అర్బన్ పోలీసు స్టేషన్లలో చైన్ స్నాచింగ్ కేసు మరియు కర్నాటక రాష్ట్రం పావగడ నందు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి
జిల్లాలో చైన్ స్నాచర్లపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా వేశారు. అనంతపురం సిసిఎస్ సి.ఐ లు ఇస్మాయిల్, వెంకటేష్ నాయక్, జనార్ధన్ మరియు గార్లదిన్నె ఎస్‌ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి, తిరుమలేష్… కానిస్టేబుళ్లు రంజిత్, బాలకృష్ణ, షామీర్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి రాబడిన సమాచారంతో వీరిని గార్లదిన్నె సమీపంలో ఈరోజు పట్టుకున్నారు. జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి ఈ పోలీసు బృందాలను అభినందించారు.
జిల్లా స్పెషల్ బ్రాంచి, సిసిఎస్ పోలీసుల సమాచారంతో అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడి వివరాలు:
1) బి.వేణు వయసు 28 సం., కేశేపల్లి గ్రామం, నార్పల మండలం
ఇతను ఇండియన్ ఆర్మీ జవాన్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను సెలువుపై అనంతపురం వచ్చాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాట లాంటి వ్యసనలకు ఆలవాటుపడి ఇతను అప్పులు చేసుకున్నాడు. ఎలాగైనా డబ్బులు ఆయాచితంగా సంపాదించాలని అనుకున్నాడు. చైన్ స్నాచింగులు చేయడం చాలా సులభమని భావించాడు. ఊరి బయట జనసంచారం లేని చోట, మహిళలను టార్గెట్ చేసి అనంతపురం నగరంతో పాటు కురుగుంటలో చైన్ స్నాచింగులు చేశాడు. జిల్లా స్పెషల్ బ్రాంచి, సిసిఎస్ పోలీసుల సమాచారం మేరకు…అనంతపురం డీఎస్పీ బి.వి.శివారెడ్డి పర్యవేక్షణలో అనంతపురము రూరల్ సి.ఐ రామకృష్ణా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గిరి బాబు…కానిస్టేబుళ్లు శివయ్య, పాండవ, ప్రసాద్, రాంమోహన్ రెడ్డి, రాజశేఖర్ లు బృందంగా ఏర్పడి చైన్ స్నాచింగుల కట్టడిపై నిఘా వేశారు. పక్కా రాబడిన సమాచారం మేరకు కట్టకిందపల్లి సమీపంలో ఈ నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img