Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాఠశాలల్లో ఇకనుండి వాటర్ బెల్స్ ప్రారంభం..

మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర- ధర్మవరం : మండల పరిధిలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఇకనుండి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాటర్ బెల్స్ ను ప్రారంభించడం జరుగుతున్నదని ఎంఈఓలు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రోజులో మూడుసార్లు బెల్స్ మోగించాలని ఆదేశాలు అందినట్లు వారు తెలిపారు. ఉదయం 8:45 కు, 10:50 కు, 11:50 కు గంట కొట్టాలని వారు తెలిపారు. అదేవిధంగా ఎండ తీవ్రత సందర్భంగా వడదెబ్బ తగలకుండా విద్యార్థులకు తగిన సూచనలు కూడా ఇవ్వాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img