Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మార్కెట్ ధరతో పౌరసరఫరాల శాఖ ద్వారా రైతుల దగ్గర నుంచి కందులు కొనుగోలు చేయాలి

: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : మార్కెట్ ధరతో పౌరసరఫరాల శాఖ ద్వారా రైతుల దగ్గర నుంచి కందులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మరియు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ రబీలో ఈ-క్రాప్ బుకింగ్ మరియు రైతుల యొక్క ఈ- కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా మార్కెట్ ధరకే రైతుల దగ్గర నుంచి కందులు కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ విషయం రైతులకు తెలియజేయాలని, దళారులను నమ్మి తక్కువ ధరకి పంటను అమ్ముకోవద్దని తెలియజేయాలన్నారు. కందులు కొనుగోలు సంబంధించి రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించాలన్నారు. అలాగే నాణ్యత ప్రమాణాలను రైతులు పాటించాలన్నారు. కందులు సాగు చేసి ఈ- పంటలు నమోదైన రైతులు కందులు కొనుగోలు సంబంధించి రైతు భరోసా కేంద్ర సిబ్బందిగానీ, వ్యవసాయ అధికారులనుకానీ సంప్రదించాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి కందులను పిడిఎస్ ద్వారా కంది బ్యాళ్ల రూపంలో ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని, కందుల కొనుగోలుకు రైతాంగం సహకరించాలని సూచించారు. అలాగే రైతులకు మార్కెట్ ధర కంటే అధికంగా గ్రామస్థాయిలోనే కొనుగోలు చేస్తారని, అలాగే ఖచ్చితమైన తూకం, వారం రోజు లోపల నగదును రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయం రైతులు గమనించాలన్నారు. అవసరం వున్నచోట రైతు భరోసా కేంద్రాలకు ఎరువులను సరఫరా చేయాలన్నారు. ప్రతి ఆర్.బి.కెలలో విత్తనాలు మరియు ఎరువుల సంబంధించిన నగదు క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ, ఖరీఫ్ మరియు రబీ కాలాల్లో వర్షాభావం నేపథ్యంలో రాబోయే రోజుల్లో నీరు బోర్లలో కూడా తగ్గిపోయే అవకాశం ఉందని, తక్కువ నీటితో సాగే చిరుధాన్యాల పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని, అధిక నీరు వాడే మొక్కజొన్న, వరి లాంటి పంటలు సాగు చేయరాదన్నారు. జిల్లాలో తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్ బి కే స్థాయిలో మార్కెట్ ధరతో కందులు కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి తేమ మరియు నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా రైతులను అవగాహన కల్పించాలన్నారు. దళారులను నమ్మి తూకంలోనూ మరియు తక్కువ ధరలకు పంటను అమ్మి మోసపోవద్దని రైతులను కోరడం జరిగింది. కంది పంట కొనుగోలు అనేది ఫిబ్రవరి వరకు కొనసాగిస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు అలమూరు సుబ్బారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్ ధరతో పంటలు కొనుగోలు చేయడం అనేది సంతోషకరమైన విషయమని తెలియజేయడం జరిగింది. ఈ పద్ధతిని ఇలాగే కొనసాగిస్తే రైతులకు మంచి జరుగుతుందన్నారు. ఈ సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులు ఉండడం వలన ఈ పంట నమోదు మరియు ఈ- కేవైసీని పక్కాగా నిర్వహించడం వలన రైతులకు ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు పంటల బీమా, పంట నష్టపరిహారం రావడానికి అవకాశం ఉంటుందన్నారు.p
ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రమణ్యం, ఉద్యాన శాఖ డిడి రఘునాథరెడ్డి, ఏపీఎమ్ఐపి పిడి ఫిరోజ్ ఖాన్, సివిల్ సప్లై డిఎం రవీంద్ర, జిల్లా సిరికల్చర్ అధికారి ఆంజనేయులు, రేకులకుంట ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త సహదేవ రెడ్డి, ఏపీఎస్పీడిసిఎల్ ఎడి వివేకానందస్వామి, మార్క్ఫెడ్ డిఎం పెన్నేశ్వరి, నాబార్డ్ డిడిఎం అనురాధ, డిసిఓ ప్రభాకర రెడ్డి, ప్రోగ్రెసివ్ రైతులు సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, ఎపి సీడ్స్ డిఎం సుబ్బయ్య, మార్కెటింగ్ ఎడి చౌదరి, ఎడిఏలు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సలహా మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img