Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఘనంగా జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర వేడుకలు..

మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర ధర్మవరం :(శ్రీ సత్యసాయి జిల్లా) పట్టణంలోని కొత్తపేటలో గల ఉషోదయ స్కూల్లో ఉదయము, తదుపరి కళాజ్యోతి సర్కిల్లో మధ్యాహ్నం కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన వికసిత్ బారత్ సంకల్ప యాత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం డిసెంబర్ 31 వ తేదీ నుండి జనవరి రెండవ తేదీ వరకు మూడు రోజులు పాటు జరుగుతాయి. ఈ వేడుకల్లో రాజేంద్రనగర్, బాలాజీ నగర్, లక్ష్మీ నగర్, కొత్తపేట, రామ్ నగర్ తారకరామాపురం, నేసే పేట, బోయ వీధి, మార్కెట్ వీధి, లింగశెట్టి పాలెం, లోని కోట, గాంధీనగర్, బాబు జగ్జీవన్ రామ్ నగర్, ఇందిరానగర్, పీఆర్టీ వీధి, బ్రాహ్మణ వీధి, ఎస్బిఐ కాలనీ, సాయి నగర్, యాదవ వీధి సచివాలయ పరిధిలోని వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి ఈ కార్యక్రమము యొక్క వివరాలు వాటి ప్రయోజనాలు గూర్చి ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ఓబులేసు, జింక చంద్రశేఖర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ వాహనం ద్వారా ఏర్పాటుచేసిన వీడియో స్క్రీన్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రయోజనాలను చూపించారు. తదుపరి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రారంభించబడిన 17 పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిందని, లబ్ధిదారులు కూడా ఈ సభలో తమ యొక్క తృప్తిని ప్రకటించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. తొలుత లబ్ధిదారులచే అధికారులు కూడా ప్రతిజ్ఞ సామూహికంగా చేశారు. సాధికారతపై మహిళలకు భరోసా లో పీఎం ముద్ర యోజన, పీఎం ఆవాస్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, ఆయుష్మాన్ భారత్ అణగారిన వర్గాలకు సామాజిక భద్రతలో భాగంగా జన్ ద న్ యోజన, జీవనజ్యోతి బీమా యోజన, రైతు సంక్షేమానికి భరోసా కార్యక్రమాలు, చారిత్రక ప్రదేశాలను పునరుద్ధరణ, అంకుర భారతం, ప్రగతి పదాన దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి వివరాలను తెలియజేశారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన 2024 క్యాలెండర్ లను విడుదల చేశారు. లబ్ధిదారులతో స్వయంగా మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ముఖాముఖిలో కేంద్ర ప్రభుత్వము యొక్క సంక్షేమ పథకాలు అందాయా? లేదా? లాంటి విషయాలపై ఆరా తీసి, అప్పటికప్పుడే సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. అంతేకాకుండా కట్టెల పొయ్యి ఉన్నవారికి హెచ్.పీ గ్యాస్ ను కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే సుఖవంతమైన జీవితము లభిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు బాలం ఓబులమ్మ, కడప రంగస్వామి, కత్తి ఆదిలక్ష్మి, మున్సిపల్ ఈఈ సత్యనారాయణ డిఈలు- ప్రకాష్, వీరేష్, మున్సిపల్ మేనేజర్ ఆనంద్ కుమార్, టిపిఓ.సాయి ప్రసాద్, టిపిఆర్ఓ. సుబ్బరాయుడు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img