Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అభివృద్ధికి మలుపు జాఫర్‌ గెలుపు

అనంతపురంలో సీపీఐ ప్రచార జోరు
సమస్యలపై పోరాడే మిమ్మల్నే గెలిపిస్తామంటున్న ఓటర్లు

ఇండియా కూటమి పార్టీల బృందం అందరిని కదలిస్తూ… కలిసి ముచ్చటిస్తూ కంకి`కొడవలి గుర్తుపై ఓటువేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే జాఫర్‌ను శాసనసభకు పంపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నది. నియోజకవర్గం అభివృద్ధి సాధించాలన్నా, జనవాణి అసెంబ్లీలో వినిపించాలన్న జాఫర్‌ని గెలిపించి తీరాలని ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలను నిలదీస్తారనీ, అందుకే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వారిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నది. బీజేపీ, వైసీపీ, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి జాఫర్‌ చేస్తున్న కృషిని కళ్లకు కట్టినట్టు
వివరిస్తున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజా గొంతుక అనంతపురం అర్బన్‌ శాసనసభా నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి సి.జాఫర్‌ ఎన్నికల ప్రచారం ప్రజా అభిమానులతో ముందుకు సాగుతోంది. జాఫర్‌ విజయం కోసం నియోజకవర్గంలో ఇండియా కూటమి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ శ్రేణులు నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి కంకికొడవలి గుర్తుకు ఓటువేసి జాఫర్‌ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. సీపీఐలో గత 41 సంవత్సరాలుగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతున్న యోధుడు జాఫర్‌ని గెలిపించడం ద్వారా అసెంబ్లీలో ప్రజావాణి వినిపించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రత్యేకంగా మహిళా సమాఖ్య, కార్మిక, కర్షక దళాలు మండుటెండను, వడగాడ్పులను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. జాఫర్‌ తనదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి శైలజానాథ్‌, అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వి. మల్లికార్జున వెంటరాగా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఏప్రిల్‌ 23న జాఫర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తన ప్రచారంలో నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబాటు, జరిగిన అవినీతిని తీవ్రంగా ఎండగడుతున్నారు. అభ్యర్థి జాఫర్‌ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వివిధ డివిజన్లలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నగర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని సగభాగంపైగా ఆయన ప్రచారం పూర్తిచేశారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును కలిసి కంకికొడవలి గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ప్రతి వీధిలోనూ ఆయన ప్రచారానికి ఓటర్ల నుంచి విశేష స్పందన వస్తోంది. స్థానికులు ఎదురేగి ఆయనకు స్వాగతం పలికి ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు గతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు అందించిన సేవలను గుర్తుచేసుకుని మళ్లీ కమ్యూనిస్టులు రావాలనే ఆకాంక్షను బలంగా వ్యక్తంచేస్తున్నారు. ఓటువేసి తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో వినిపించే కమ్యూనిస్టులను గెలిపించాలని జాఫర్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కోట్లు అవసరం లేదు… ప్రజల మద్దతు చాలు అని కమ్యూనిస్టులకు అనేకమార్లు ఇక్కడి జనం పట్టం కట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నియోజకవర్గంలో గతంలో కమ్యూనిస్టులు ఎన్నికైనప్పుడు, ఇతరులు ఎన్నికైనప్పుడు అభివృద్ధిలో ఎంతో తేడావుందనీ, ఈ తేడాను బేరీజు వేసుకుని తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాన్ని గతంలో సమతుల్యంగా అభివృద్ధి చేసిన ఘనత కమ్యూనిస్టులకు ఉందనీ, అదే స్ఫూర్తితో పని చేస్తున్న తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుం దన్నారు. ప్రజలకు పన్నుల భారం లేని, వివక్ష లేని పారదర్శక పాలన కోసం ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని జాఫర్‌ కోరుతున్నారు. నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాటాలను ప్రజలకు వివరంగా తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నారు. పేద ప్రజలకు వేలాది పట్టాలిప్పించడం ఒక సీపీిఐకే సాధ్యమని ప్రజలు చెపుతూ జాఫర్‌కే ఓటువేస్తామని హామీ ఇస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చినందున పేదల సమస్యలు తెలిసిన జాఫర్‌ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాలతో పోరాడి సమస్యలను పరిష్కరిస్తున్నారనీ, ఆందుకని ఆయనకే ఓటువేసి గెలిపిస్తామని ఓటర్లు మాట ఇస్తున్నారు.

విశాలాంధ్ర అనంతపురం వైద్యం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img