Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక రెడీ

రాష్ట్రపతి ఎన్నికతో కథ ఆరంభం
యూపీ ఎన్నికల కోసమే క్యాబినెట్‌ విస్తరణ
నదీజలాల వివాదం బూటకం
షర్మిలకు జగన్‌, కేసీఆర్‌ అండ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్రవిశాఖ రూరల్‌ : కేంద్రంలోని బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక రూపొందుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. 2023లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల నుంచే ఇది అమలు జరుగుతుందని చెప్పారు. విశాఖలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడిరచాలని, రాష్ట్రపతి పదవికి వేదిక అభ్యర్థిగా ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ని రంగంలో దించాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఎన్‌డీఏకి వ్యతిరేకంగా మారుతున్నాయని, జాతీయ పార్టీలు ఒకే వేదికపైకి వస్తాయని నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిని ఓడిరచడంతో బీజేపీ ప్రభుత్వ పతనానికి బీజం పడనుందని చెప్పారు. నాడు ‘మినిమమ్‌ గవర్నమెంట్‌మ్యాగ్జిమమ్‌ గవర్నెన్స్‌’ అని చెప్పిన మోదీ సర్కారు.. నేడు ‘మ్యాగ్జిమమ్‌ గవర్నమెంట్‌`మినిమమ్‌ గవర్నెన్స్‌’ గా మారిందని విమర్శించారు. తాజా క్యాబినెట్‌ విస్తరణే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసమే క్యాబినెట్‌ విస్తరణ జరిగిందని, క్యాబినెట్‌లో ఉత్తరప్రదేశ్‌ నాయకులు 14 మందికి చోటు కల్పించడం అందులో భాగమని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ఆరోగ్యశాఖమంత్రిని తప్పించడమే దీనికి నిదర్శనమన్నారు. దేశంలో 41 లక్షల మంది కరోనా వల్ల మృతి చెందినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడిరచిందని, కేంద్రం మాత్రం నాలుగు లక్షలు లెక్కలు చెబుతోందని విమర్శించారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వలేని మోదీ సర్కారు…కార్పొరేట్‌ సంస్థలకు రూ.1.60లక్షల కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కరోనా మరణాలను దాచిపెడుతోందని, తిరుపతి రుయా ఆసుపత్రి మరణాలే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఆర్‌బీఐ, సీబీఐ, ఎన్నికలసంఘం వంటి వ్యవస్థలను ప్రధాని మోదీ డమ్మీగా మార్చేశారని, రాష్ట్రపతి రబ్బర్‌స్టాంప్‌గా మారారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని నారాయణ విమర్శించారు.29 మంది బడా పారిశ్రామికవేత్తలు రూ.10.10 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టారని గుర్తుచేశారు. వీరిలో విజయ్‌మాల్యా తప్ప అందరూ గుజరాత్‌కి చెందినవారేనన్నారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన సాగుచట్టాలతో రైతులంతా అదానీ, అంబానీలకు బానిసలుగా మారతారని నారాయణ చెప్పారు. లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టారని విమర్శించారు. కేంద్రం దృష్టి సహకార రంగంపై పడిరదని, అందుకే అమిత్‌షాని ఇన్‌చాÛర్జిగా పెట్టారని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల వివాదాన్ని ఓ డూప్‌ ఫైట్‌గా నారాయణ అభివర్ణించారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ నాటకమాడుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కనుసన్నల్లోనే తెలంగాణలో షర్మిళ పార్టీ ఆవిర్భవించిందన్నారు. దీనికి జగన్‌ నిర్మాత కాగా, కేసీఆర్‌ దర్శకుడని అన్నారు. భవిష్యత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు. అమిత్‌షా అభయహస్తం అందించినంత కాలం జగన్‌ బెయిల్‌ రద్దు కాదన్నారు. రఘురామకృష్ణరాజు అనర్హత వ్యవహారాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నాన్చుతోందని చెప్పారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, నగర కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, జిల్లా కార్యవర్గసభ్యురాలు ఎ.విమల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img