Friday, June 14, 2024
Friday, June 14, 2024

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాలు వల్ల స్వల్పంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని తెలిపారు. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తుంది. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణం చేయొద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదన్నారు. గురువారం రాత్రి 7 గంటల నాటికి ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 6,48,291 ఉందని.. శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయన్న అంచనాతో గోదావరి, కృష్ణా నదులకు వచ్చే వరదకు వర్షాలు కూడా తోడు అయితే పరిస్ధితులు ఇబ్బందికరంగా మారతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షాలు మాత్రమే కురుస్తుండటంతో అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img