Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మురళిని ఎమ్మెల్యే చేద్దాం

ప్రజలను మభ్య పెట్టడానికే జగన్‌ బటన్‌ నొక్కుడు
ఓట్ల కోసం టీడీపీ వెంపర్లాట: హరినాథరెడ్డి

విశాలాంధ్ర-తిరుపతి: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలను మభ్య పెట్టడానికే జగన్‌ బటన్‌ నొక్కుడు కార్యక్రమం చేపట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమి బలపరిచిన తిరుపతి అసెంబ్లీ సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీ మురళిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం నగరంలో లెనిన్‌ నగర్‌, ప్రగతి నగర్‌, గరుడాద్రి నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కంకి-కొడవలి గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థ్ధించారు. హరినాథరెడ్డి మాట్లా డుతూ… జగన్‌ మూడు నెలల కిందట బటన్‌ నొక్కినా పేదల ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు. అవన్నీ ఉత్తుత్తి బటన్‌ నొక్కుళ్లే అన్నారు. పోలింగ్‌ దగ్గర పడటంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వారి ఖాతాల్లో ఇప్పుడు నగదు జమ చేస్తున్నారన్నారు. జగన్‌ కుట్రలను ప్రజలు గ్రహించి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి … తాను నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఊకదంపుడు ప్రసంగాలిస్తున్నారని ధ్వజమెత్తారు. నిజంగా ప్రజలకు మేలు చేసి ఉంటే ఓట్ల కోసం నగదు ఎందుకు పంపిణీ చేస్తున్నారని హరినాథరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్‌… ఐదేళ్లుగా ప్రతిపక్ష పార్టీలను, ప్రజలను కలవ లేదని… చివరకు ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. మూడు నెలలుగా బటన్‌ నొక్కుతున్నా ప్రజలకు చేరలేదని… .ఆఖరి నిమిషంలో నగదు ఇస్తామని చెప్పడంలో మీ ఉద్దేశ్యం ఏదో సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ జగన్‌ను కోరిందని హరినాథరెడ్డి గుర్తు చేశారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుని ఓట్ల కోసం వెంపర్లాడు తోందన్నారు. డబ్బు వెదజల్లి ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని హరినాథరెడ్డి ఆరోపించారు. ప్రజల పట్ల ఈ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. వీటిని అర్థం చేసుకుని కార్మికుల పక్షాన పోటీ చేస్తున్న మురళికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, ప్రభాకర్‌, శశి, నదియా, చలపతి, నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img