Friday, May 31, 2024
Friday, May 31, 2024

పత్తికొండ అభివృద్ధికి పాటుపడేది రామచంద్రయ్యే..

విశాలాంధ్ర-వెల్దుర్తి: పత్తికొండ సీపీఐ అభ్యర్థి పి.రామచంద్రయ్య శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లా, వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు కృష్ణాపురం, పుల్లగుమ్మి, కలుగోట్ల, చెరకులపాడు, కోసనాపల్లె గ్రామాల్లో డప్పు కళాకారుల ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ అభ్యర్థి పి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరుస్తున్న తనకు కంకి`కొడవలి గుర్తుపై, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి పి.జి.రాంపుల్లయ్య యాదవ్‌కు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం చెరుకులపాడు గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు పత్తికొండ అభివృద్ధిని విస్మరించారన్నారు. నియో జకవర్గంలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నా ఆ పార్టీలు పట్టించుకోలేదని, కోట్లాది రూపాయలు సొమ్ములు చేసుకుని, అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా శాసన సభ్యులుగా గెలిచిన ఏ ఒక్కరు కూడా అన్నదాతల కన్నీటిని తుడవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు గత ఎన్నికల్లో పత్తికొండలో టమాటా జ్యూస్‌ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చి, ఓట్లు దండుకొని పరిశ్రమ ఊసే ఎత్తడం లేదని తెలిపారు. నియోజకవర్గంలో అనేక సంవత్స రాలుగా సీపీఐగా ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా పిలిస్తే పలికి, ఆపదలో ఆపన్న హస్తమై నిలిచామన్నారు. నియోజకవర్గంలో సీపీఐ అధ్వర్యంలో స్వర్గీయ చదువుల రామయ్య నాయకత్వంలో భూమిలేని నిరు పేదలకు వేల ఎకరాలు పంచామని గుర్తు చేశారు. ప్రజాసేవకే అంకితమైన భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజల ముందుకు వచ్చామని, ఇండియా కూటమి అభ్యర్థులుగా తమను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.జగన్నాథం, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌, మండల కార్యదర్శి కృష్ణ, సీపీఐ జిల్లా నాయకులు రాజు, సోమన్న, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు శరత్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు శేషు, ప్రజానాట్యమండలి నాయకులు వెంకటరాముడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img