Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ఐక్యూ జెడ్‌ 9ఎక్స్‌ మే 16న లాంచ్‌

న్యూఢల్లీి: హై పెర్ఫార్మెన్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ జెడ్‌ 9ఎక్స్‌ను మే 16, 2024న భారత్‌లో విడుదల చేయనుంది. అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లర్‌ గుర్తింపు పొందిన ఐక్యూ జెడ్‌ 9, ఐక్యూ జెడ్‌ 7 ప్రో, ఐక్యూ జెడ్‌ 7 వంటి జెడ్‌ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్ల విజయం ఆధారంగా ఈ సిరీస్‌ మెరుగైన పనితీరు డిజైన్‌, కెమెరా సామర్థ్యాల ద్వారా స్థిరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఐక్యూ జెడ్‌ 9ఎక్స్‌ భారీ బ్యాటరీ ప్రత్యేకమైన డిజైన్‌తో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి వస్తోంది. స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 మొబైల్‌ ప్లాట్‌ ఫామ్‌ తాజా 4 ఎన్‌ఎమ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది బలమైన పనితీరు, చాలా తక్కువ విద్యుత్‌ వినియోగాన్ని అందిస్తుంది. 5.6 ఎల్‌G కంటే ఎక్కువ యాంట్యూ బెంచ్‌ మార్క్‌ స్కోర్‌తో, ఐక్యూ జెడ్‌ 9ఎక్స్‌ సెగ్మెంట్‌తో వేగవంతమైన ఫోన్లలో ఒకటిగా నిలుస్తుంది. 7.99 ఎంఎం అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌లో ఉన్న 6000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే వరుసగా రెండు రోజుల పాటు మీ రోజువారీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌, అడ్వెంచర్స్‌లో ముందుకు సాగడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img