Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఒకే రోజు 12 క్లోవ్‌ డెంటల్‌ కొత్త క్లినిక్స్‌ ప్రారంభం

ముంబయి: దేశవ్యాప్తంగా పేరుపొందిన అతిపెద్ద డెంటల్‌ చెయిన్‌ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది క్లోవ్‌ డెంటల్‌. ఇప్పటికే ఎన్నో శాఖలు ద్వారా వినియోగదారులకు సేవలు అందిస్తోంది క్లోవ్‌ డెంటల్‌. గత 13 ఏళ్లుగా వినియోగదారులకు విశేషమైన సేవలు అందిస్తున్న క్లోవ్‌ డెంటల్‌… తాజాగా ఒకే ఒక్క రోజులో 12 కొత్త క్లినిక్స్‌ ఏర్పాటు చేసింది. మే 3, 2024న ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా 500 క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలన్న క్లోవ్‌ డెంటల్‌ నిబద్ధతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో కూడా ప్రతీ ఒక్కరికి అందించాలన్న కృత నిశ్చయంతో పనిచేస్తుంది క్లోవ్‌ డెంటల్‌. డెంటల్‌ రంగంలో సరికొత్త బెంచ్‌ మార్క్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ మైలురాయిని సాధించిన తర్వాత, నోటి ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా దేశానికి సేవ చేసేందుకు తన నిబద్ధతను పునరుద్ఘాటించింది క్లోవ్‌ డెంటల్‌. డెంటల్‌ చికిత్సలో అత్యంత అంకితభావంతో పనిచేస్తున్న క్లోవ్‌ డెంటల్‌… పేషంట్లకు పారదర్శకమైన, నైతికమైన చికిత్సలను అందించేందుకు సదా సిద్ధంగా ఉంటుందని క్లోవ్‌ డెంటల్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అమరీందర్‌ సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img