ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగిసింది. నేటి మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కవితపై ఈడీ చార్జి షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి కవిత చార్జి షీటును నేడు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.