Monday, May 20, 2024
Monday, May 20, 2024

గూగుల్‌ వాలెట్‌ యాప్‌ విడుదల

న్యూదిల్లీ: భారతదేశంలో గూగుల్‌ వాలెట్‌ యాప్‌ను విడుదల చేశామని గూగుల్‌ ప్రకటించింది. ఈ యాప్‌ రోజువారీ అవసరాలకు వేగవంతమైన, సురక్షితమైన యాక్సెస్‌ను అందిస్తుంది. బోర్డింగ్‌ పాస్‌లు, లాయల్టీ కార్డ్‌లు, సినిమా టిక్కెట్‌లు, తదితర ముఖ్యమైన డిజిటల్‌ దాఖలాలను సౌకర్యవంతంగా స్టోర్‌ చేసుకునేందుకు, తిరిగి పొందేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. గూగుల్‌ వాలెట్‌కు అనుబంధంగా గూగుల్‌ పే భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల చెల్లింపుల అవసరాలను అందించడాన్ని కొనసాగిస్తుంది.భారతదేశంలో గూగుల్‌ వాలెట్‌ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్న సందర్భంలో 20 టాప్‌ బ్రాండ్‌లతో కంపెనీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో పీవీఆర్‌ అండ్‌ ఐనాక్స్‌, ఎయిర్‌ ఇండియా, ఇండిగో, ఫ్లిప్‌కార్ట్‌, పైన్‌ ల్యాబ్స్‌, కోచి మెట్రో, అభిబస్‌ తదితర సంస్థలు ఉండగా, రానున్న నెలల్లో మరికొన్ని సంస్థలు ఇందులో చేరనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img