Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఐక్యత దిశగా చేనేతవర్గాలు

శిరందాసు నాగార్జున

రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు, సామాజిక వర్గాలు ఏకమవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారు అసంఘటితవర్గాలుగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడం వల్ల వారు ఏకం కాలేకపోతున్నారు. కొన్ని వృత్తులకు సంబంధించి సామాజిక వర్గాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉన్నా, ఉన్నత చదువులు చదువుకున్నా వారు రాజకీయంగా ఎదగలేక పోతున్నారు. మనదేశంలో అనేక కులావారు ఒకే వృత్తిలో ఉంటుంటారు. అటువంటివారిలో ఐక్యతాలోపం వల్ల రాజకీయంగా మంచి స్థానాన్ని పొందలేకపోతున్నారు. అటువంటి వారిలో చేనేత సామాజిక వర్గాలవారు కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాలలో, దేశంలో గణనీయంగా ఉన్నా వారికి రాజకీయంగా తగిన స్థానం లభించడంలేదు. అయితే, చేనేత కులాలలో ఉన్నత చదువులు చదివి దేశ విదేశాలలో ఆర్థికంగా స్థిరపడినవారు అనేకమంది ఉన్నారు. శాస్త్ర సాంకేతికరంగాలలో నిష్ణాతులున్నారు. చేనేతకు సంబంధించి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి, సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియ, కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్లు, దూదేకుల, కైకాల, కుర్ని, ఖత్రి, నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్‌ వంటి దాదాపు 25 కులాల వారు మన దేశంలో ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి చేనేత. చేనేత వృత్తిగా ఉన్న వీరిలో కొన్ని కులాల వారికి తగిన గుర్తింపేలేదు. అందువల్ల రాజకీయంగా, సామాజికంగా తగిన స్థానం సాధించు కోవాలన్న తపనతో చేనేత వృత్తిగా గల ఈ కులాల వారినందరినీ కలపడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక కుల సంఘాలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చేనేత మూలాలున్న ఉన్నత విద్యావంతులు, మేథావులు కలిసి అంతర్జాతీయ చేనేత కార్మిక సంస్థ(వరల్డ్‌ వీవర్స్‌ ఆర్గనైజేషన్‌)ను ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా అమెరికాలోని డెట్రాయిట్‌, దల్లాస్‌, చికాగో, న్యూజెర్సీ వంటి నగరాలతోపాటు కెనడాలలో ఉండే వారు ఈ సంస్థను స్థాపించారు. దేశవ్యాప్తంగా ఉన్న, ఎన్‌ఆర్‌ఐ చేనేత కులాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం, ఒక బలమైన శక్తిగా రూపొందించడం. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. అలాగే, ప్రభుత్వాల సహకారంతో చేనేత కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం. చేనేత వర్గాలు ఆర్థిక, విద్య, సామాజిక, సాంస్కృతిక తదితర రంగాలలో నిలదొక్కుకోవడానికి సహాయ సహకారాలు అందించడం, చేనేత వృత్తిపై ఆధారపడిన వారి వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచి, వారికి కావలసిన పరికరాలు అందించడం, చేనేత వస్త్రాల మార్కెటింగ్‌, చేనేత కుటుంబా లకు వైద్యం, విద్య వంటి ముఖ్యమైన విషయాలలో సహకారం, విదేశీ విద్య, ఉపాధి, వ్యాపారం, వివాహాలు వంటి అంశాలలో సహకారం అందించాలన్న ఉత్తమ ఉద్దేశాలతో దీనిని స్థాపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, భారతీయ ట్రస్ట్‌ సహకారంతో 2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ పద్మశాలి భవన్‌లో వంద చేనేత కుటుంబాలకు ఆసు యంత్రాలను ఈ సంస్థ అందించింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంలో ఈ సంస్థ ఉంది. గత డిసెంబరు 10న తిరుచిరాపల్లిలో ప్రపంచ చేనేత సంస్థల సదస్సు తమిళనాడు శాఖను ఏర్పాటు చేశారు. దేశంలోని చేనేత సామాజిక వర్గాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించేందుకు నేడు (ఈ నెల 30వ తేదీ ఆదివారం) ప్రసిద్ధ చేనేతకేంద్రం ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరుజిల్లా మంగళగిరిలో ప్రపంచ చేనేతసంస్థల సదస్సు-2023ని నిర్వహించనున్నారు.
సీనియర్‌ జర్నలిస్టు, సెల్‌:9440222914

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img