హైదరాబాద్ : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్’. పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్సాంగ్ యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. మరోపక్క వివాదానికి గురైంది. హీరో పాత్రను వర్ణిస్తూ పవర్‌ఫుల్‌గా సాగే ఈ పాటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల గురించి ఈ సాంగ్ లో వివరించిన తీరు బాగాలేదని హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తెలం గాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు. ప్రజలకు రక్షణ కల్పిం చేందుకు జీతాలు తీసుకునే మేం వారి ఎముకల్ని విరగ్గొట్టం. పోలీసుల గొప్పతనాన్ని చెప్పేందుకు గేయ రచయిత రామ జోగయ్యశాస్త్రికి తెలుగులో ఇంతకన్నా మంచి పదాలు దొరక లేదేమో! ఈ పాటలో పోలీసుల సేవల గురించి తెలప లేదు’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ‘సినిమాను సినిమాలా చూడాలి సర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.