Monday, May 20, 2024
Monday, May 20, 2024

వసూళ్లలో దూసుకుపోతున్న ‘మహావీరుడు’

హైదరాబాద్‌: కోలీవుడ్‌ యాక్టర్‌ శివకార్తికేయన్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం మావీరన్‌. తెలుగులో మహావీరుడు పేరుతో విడుదలైంది. మడొన్నే అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచి మావీరన్‌కు బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ వస్తోంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన అప్‌డేట్‌ తెరపైకి వచ్చింది. మావీరన్‌ ఇప్పటివరకు రూ.75 కోట్లు వసూళ్లు చేసింది. రానున్న రోజుల్లో రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకోవడం తథ్యమని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కూతురు అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించగా… సునీల్‌ కీలక పాత్ర పోషించాడు. శాంతి టాకీస్‌ బ్యానర్‌పై అరుణ్‌ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించగా… భరత్‌ శంకర్‌ సంగీతం అందించాడు. శివకార్తికేయన్‌ మరోవైపు అయలాన్‌ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శివకార్తికేయన్‌ మరోవైపు రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే కశ్మీర్‌ లొకేషన్‌లో సాయిపల్లవికి సంబంధించిన స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img