London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మోదీ దబాయింపు విధానం

చెప్పిన అబద్ధాన్నే చెప్పడం, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పడం – ఈ రెండు లక్షణాలూ అబద్ధాల కోరులందరికీ ఉండేవే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రెండు విద్యల్లోనూ ఆరితేరి పోయారు. అయితే మోదీ సాధారణంగా చేసిన తప్పు ఒప్పుకోరు. అంటే ఆయన ఉద్దేశ పూర్వకంగానే, నిర్దిష్ట లక్ష్యంతోనే అబద్ధాలాడతారు. కానీ తాను ముస్లింల మీద ద్వేష భావంతో మాట్లాడలేదని మోదీ మొదటిసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. తనకు అందరూ సమానమేనని, ‘‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’’ తన మార్గం అని ఆయన చెప్పుకుంటున్నారు. గత నెల 21న రాజస్థాన్‌లో బాన్స్వాడాలోని ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎస్‌.సి., ఎస్‌.టి. ల రిజర్వేషన్లు లాగేసుకుని ముస్లింలకు కట్టబెడ్తుందని అన్నారు. ఆ ప్రసంగం నిండా ముస్లింల మీద విద్వేషమే ఉంది. బీజేపీ అధికారికంగా తయారు చేసే వీడియోల్లో కూడా ఈ మాటలు రికార్డు అయిఉన్నాయి. ముస్లింలను దృష్టిలో ఉంచుకునే మోదీ ‘‘పిల్లలు ఎక్కువ మంది ఉన్నవారు’’, ‘‘చొరబాటుదార్లు’’ అన్నారు. ఇప్పుడేమో తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వాదిస్తున్నారు. ‘‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అంటే ముస్లింలేనని ఎందుకు అనుకుంటారు? వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు?’’ అని మోదీ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. న్యూస్‌ 18 వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాను ముస్లిం ద్వేషిని కాదని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అధిక సంతానం ఉన్న వారు అన్న తన మాటకు కొత్త భాష్యం చెప్పడానికి కూడా ప్రయత్నించారు. ఎక్కువమంది సంతానం ఉండడానికి పేదరికమే కారణం అని కూడా అన్నారు. తాను హిందువులను, ముస్లింలను ఎక్కడా ప్రస్తావించలేదంటున్నారు. అలా అని ఉంటే తాను జన జీవనరంగంలో ఉండే అర్హతే కోల్పోతానని కూడా అన్నారు. మోదీ ముస్లింల మీద విరుచుకుపడ్తూ మాట్లాడిన వీడియోలను బీజేపీ అధికారికంగానే విడుదల చేసింది. ఇలాంటి ఒక వీడియోను ఉపసంహరించాలని కూడా ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులపై సర్వే చేయించి ‘‘మన అక్క చెల్లెళ్ల బంగారం’’ ముస్లింలకు పంచేస్తారని మోదీ అనుమానాలకు తావు లేని రీతిలోనే మాట్లాడారు. హిందువుల మెడలోని మంగళ సూత్రాలనూ లాగేస్తారని అన్నారు. ఈ మాటలు అనడంలో మోదీకి రెండు లక్ష్యాలు ఉన్నాయి. బంగారం, మంగళ సూత్రాలను ప్రస్తావిస్తే మహిళలను ఆకట్టుకోవచ్చు. వీటిని లాక్కుని ముస్లింలకు పంచుతారు అంటే ముస్లింల మీద ద్వేష భావాన్ని పెంచవచ్చు. న్యూస్‌ 18 కు ఇంచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం తాను ఈ మాటలు అనలేదని మోదీ వితండవాదం చేస్తున్నారు. ముస్లింల మీద విషవమనం మోదీకి కొత్త కాదు. ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శరణార్థుల శిబిరాలను సందర్శిస్తూ ‘‘ఎక్కువ మంది పిల్లలను కనే వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేయాలా చెప్పండి’’ అని ప్రశ్నించడంలోనూ ప్రతి మాటలోనూ ముస్లింలపై ద్వేష భావమే ఉంది. అంతే కాక 2006లో అప్పటి ప్రధానమంత్రి డా. మన్‌ మోహన్‌ సింగ్‌ దేశ వనరులపై ముస్లింలకు ప్రథమ హక్కు ఉంటుంది అని అన్నట్టు మోదీ అడ్డంగా వక్రీకరణలకు పాల్పడ్డారు. ఈ మాట ఆయన ఏదో ఒకసారి అని సరిపెట్టుకోలేదు. 2002లో గుజరాత్‌ మారణ కాండ తరవాత జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా ముస్లింల పునరావాస కేంద్రాలను ‘‘సంతానోత్పత్తి కేంద్రాలు’’ అన్నారు. ముస్లింలలో బహు భార్యత్వం ఉంటుందని చెప్పడానికి ‘‘మేం అయిదుగురం, మాకు 25 మంది’’ అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ కర్కశమైన వైఖరి కారణంగానే అమెరికా ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిందన్న వాస్తవాన్ని ఎలా మరిచిపోగలం!
గుజరాత్‌ ముఖ్యమంత్రి కాక ముందు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడూ 2001లో మోదీ ముస్లింల మీద విషవమనమే చేశారు. మూడు నాలుగు విడతల పోలింగ్‌ పూర్తి అయిన తరవాత హఠాత్తుగా మోదీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం ఏమిటి అన్నది అసలు ప్రశ్న. ముస్లింల మీద తనకు ఎలాంటి ద్వేషభావం లేదు అని చెప్పడానికీ ఆయన అబద్ధాన్నే ఆశ్రయించారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చడానికి పది అబద్ధాలు చెప్పవలసి రావడం అంటే ఇదే. విశ్వగురువు అని చెప్పుకుంటున్న మోదీ ముస్లింలను రాక్షసులుగా చిత్రించడాన్ని స్వదేశీ మీడియానే కాకుండా విదేశీ పత్రికలూ తూర్పార పట్టాయి. ఇది ఎన్నికల సమయంలో ప్రతికూల ఫలితాలు ఇస్తుందని మోదీకి తెలుసు. అందుకే సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. ముస్లింల మీద విషవమనం మోదీ ఒక్కరికే పరిమితం కాలేదు. అధికార చట్రంలోనూ ఇది అంతర్భాగమై పోయింది. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా సంఘం ఇటీవల ఒక పత్రం విడుదల చేసింది. అందులోనూ హిందువుల జనాభా 1950 నుంచి 2015 మధ్య 7.8 శాతం తగ్గిందని, ముస్లింల జనాభా మాత్రం 43 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ మాట చెప్పడానికి ఆ అధ్యయన పత్రం రాసిన ఆర్థిక పండితులు అధికారికమైన భారత జనాభా లెక్కలు ఆధారం చేసుకోకుండా ఏదో చిన్న సర్వే ఫలితాలను బట్టి ఈ ముస్లింల జనాభా అమాంతం పెరిగిపోతోందని జనంలో భయవాతావరణం కల్పించడానికి ప్రయత్నించారు. ముస్లింల మీద చేసిన వ్యాఖ్యలు కొంతమంది ఓటర్లకైనా వెగటు కలిగిస్తాయని మోదీకి జ్ఞానోదయం అయి ఉండవచ్చు. గుజరాత్‌ మారణకాండ మచ్చ చెరిపేసుకోవడానికి మోదీ చాలా కష్టపడవలసి వచ్చింది. అమాంతం మోదీ అభివృద్ధి ముసుగు కప్పేసుకున్నారు. మోదీ విద్వేష పూరిత ప్రసంగాలపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ మీద ఒత్తిడి పెరగడం కూడా మోదీ సంజాయిషీ ఇచ్చుకోవడానికి కారణం కావచ్చు. కొంతమంది మోదీ మీద చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టులో అర్జీలు కూడా పెట్టుకున్నారు. తాను ముస్లింలమీద విద్వేష పూరిత ప్రసంగాలు చేయలేదు అని చెప్పుకోవడం ద్వారా న్యాయస్థానాలు కన్నెర్ర చేయకుండా కాపాడుకోవాలన్న ఉద్దేశమూ ఉండవచ్చు. మోదీ విద్వేష ప్రసంగాలపై ఎన్నికల కమిషన్‌ కు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. అయితే మోదీకి నేరుగా నోటీసు జారీచేసే దమ్ములేని ఎన్నికల కమిషన్‌ బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డాకు నోటీసు పంపించింది. ఇదేమంటే పార్టీ నాయకులను నియంత్రించే అధికారం పార్టీ అధ్యక్షుడిదేనని సమర్థించుకుంది. జె.పి. నడ్డా బీజేపీ అధ్యక్ష స్థానంలో ఉండవచ్చు. కానీ ఆయన మోదీని మందలించే సాహసం చేయలగలిగే స్వతంత్రుడు కారు. అందుకే నడ్డా జంకు గొంకు లేకుండా మోదీ విద్వేష ప్రసంగాలను వెనకేసుకొచ్చారు. మోదీ మాటలనే ఉటంకించారు. ముస్లింలను తాను దూషించలేదని సంజాయిషీ ఇచ్చుకుంటున్న మోదీ క్షమాపణ చెప్పి ఉంటే చాలా హుందాగా ఉండేది. కాని అలా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది కనక దబాయింపు మార్గాన్నే ఎంచుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img