Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అనుమానాలు తీర్చని సుప్రీం తీర్పు

అనేక నెలలు ఎదురు చూసిన తరవాత, రెండు విడతల పోలింగ్‌ పూర్తి అయిన తరవాత శుక్రవారం సుప్రీంకోర్టు ఇ.వి.ఎం.లపై లేవనెత్తిన అనుమానాలపై తీర్పు వెలువరించింది. కానీ ఇ.వి.ఎం.ల మీద తలెత్తిన అనుమానాలను ఈ తీర్పు నివృతి చేయలేకపోయింది. ఇటీవల ఇ.వి.ఎం.ల సామర్థ్యాన్ని నిరూపించడానికి కేరళలో ఒక ప్రయోగం జరిగింది. అందులోనూ ఒక మీట నొక్కితే ఓటు మరొకరికి పడిన సందర్భం కనిపించింది. ఈ లోపాలను సరిదిద్దడానికి సుప్రీంకోర్టు తీర్పులో ఒక్క అంశం కూడా లేదు. ఇ.వి.ఎం.లను ఉపయోగించినప్పుడు దానికి అనుసంధానమై ఉండే వి.వి.పాట్‌ పత్రాలన్నింటినీ బేరీజు వేయాలని, లేదా మునుపటి పద్ధతిలో బ్యాలెట్‌ పత్రాలు వినియోగించి ఓట్లు వేయించాలని, అదీ కాకపోతే వి.వి.పాట్లలో ఏడు సెకన్లు మాత్రమే వెలిగే కాంతిని ఎల్లప్పుడూ వెలిగేలా చేయాలని పెట్టుకున్న అర్జీలలో ఒక్క దాన్ని కూడా న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, దీపాంకర్‌ దత్తా తో కూడిన బెంచి అంగీకరించలేదు. ఇ.వి.ఎం.ల పని తీరుపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయి. వీటి వినియోగానికి వ్యతిరేకంగా కలిగిన అనుమానాలను ఈ తీర్పు దూరం చేయకుండా ఎన్నికల కమిషన్‌ కు రెండు సూచనలు మాత్రం చేసింది. రెండు విడతల పోలింగ్‌ పూర్తి అయినా మిగతా అయిదు విడతల పోలింగ్‌ అయినా అనుమాన రహితంగా జరుగుతుందన్న ఆశలు వమ్ము అయినాయి. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అయినందువల్ల ఈ దశలో ఆ క్రమానికి భంగం కలిగించకూడదని సుప్రీంకోర్టు భావించి ఉండవచ్చు. కానీ దీనివల్ల ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలలో విశ్వాసం పాదుకొల్పడంలో అత్యున్నత న్యాయస్థానం సహకరించలేదు. ఆధునిక సాంకేతికత ఆధారంగా తయారైన ఇ.వి.ఎం.ల మీద అనుమానాలు వ్యక్తం చేసే ధోరణి సరైంది కాదని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ఇ.వి.ఎం.ల మీద అనుమానాలు వ్యక్తం చేసిన వారికి ప్రతికూలంగా ఉంది అన్న అంశాన్ని పక్కన పెట్టిన జనానికి సుప్రీంకోర్టు అదనంగా కల్పించిన భరోసా ఏమీ లేకపోవడం ఆశ్చర్యకరం. అన్నింటికీ మించి ఎన్నికల కమిషన్‌ కూడా రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ కనక తాము ఆదేశాలు ఇవ్వలేం అనడం మరీ విచిత్రంగా ఉంది. రాజ్య వ్యవస్థలోని చట్టసభలు, కార్య నిర్వాహక వర్గం మీద వచ్చే కేసులను కూడా సుప్రీంకోర్టు విచారించి మంచి చెడ్డలు తేలుస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్‌ కు ఆదేశాలు ఇవ్వలేం అనడం విడ్డూరమే. ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా ప్రజలకు అపకారం తలపెడ్తుందన్న అనుమానం వచ్చినప్పుడు, లేదా ఆ వ్యవస్థ అధికారంలో ఉన్న వారికి ఊడిగం చేస్తోందన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వివాదాన్ని తీర్చవలసిన బాధ్యత, తద్వారా రాజ్యాంగ హామీలు అమలయ్యేట్టు చేయవలసిన బాధ్యత నుంచి సుప్రీంకోర్టు ఎలా తప్పించుకోగలుగుతుందో అర్థం కాదు. ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో ఉదాహరణ ప్రాయంగా అయిదు శాతం వి.వి.పాట్ల వివరాలను మాత్రమే పరిశీలిస్తున్నారు. అలా కాకుండా వి.వి.పాట్‌. ల నుంచి వెలువడే చిన్న పత్రాలను ఓటరు చేతికి ఇస్తే అతడు చూసుకుని ఒక డబ్బాలో వేసే అవకాశం కల్పించాలన్న సూచనను కూడా న్యాయమూర్తులు అంగీకరించలేదు. వి.వి.పాట్‌ పత్రాలన్నింటినీ లెక్కించడం మొదలుపెడ్తే దానికి వారం రోజుల వ్యవధి పడ్తుంది కనక దాన్నీ సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇ.వి.ఎం. ఒకసారి మాత్రమే ప్రోగ్రాం చేసే పరికరం కాదని, దానిని తారుమారు చేసే వీలుందని ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వాదనను కూడా సరైన కారణం చూపకుండానే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఇ.వి.ఎం.లలో అవకతవకలను వ్యతిరేకించడం అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యతిరేకించడం కాదు. ఇ.వి.ఎం.ల మీద తలెత్తుతున్న అనుమానాలను సంపూర్ణంగా నివృతి చేయడం లేదా వాటిని మాయ చేయకుండా కట్టు దిట్టం చేసేట్టు ఆదేశించవలసిన బాధ్యతను సుప్రీంకోర్టు విస్మరించింది. అయితే సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ కు రెండు కర్తవ్యాలు అప్పగించింది. ఇ.వి.ఎం.లలోకి పార్టీ చిహ్నాలను చేర్చిన తరవాత ఆ చిహ్నాలను చేసిన విభాగాన్ని సీలు చేసి 45 రోజుల దాకా భద్రంగా ఉంచాలని ఆదేశించింది. రెండవది ఓటింగుకు వినియోగించిన పరికరాలలోని సాఫ్ట్‌వేర్‌ ను ఫలితాలు వెల్లడి అయిన తరవాత వాటిని తయారు చేసిన ఇంజనీర్లు పరిశీలించి నిగ్గు తేల్చాలని కూడా ఆదేశించింది. అయితే ఈ అంశాన్ని సవాలు చేసే అధికారం ఓడిపోయిన అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. వీటిని తనిఖీ చేయడానికి అయ్యే ఖర్చును ఫిర్యాదు చేసేవారే భరించాలి. ఒకవేళ అవకతవకలు నిజమేనని తేలితే సవాలు చేసిన వారు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. ఈ రెండు ఆదేశాలు అనుమానాలను తగ్గించడానికి ఉపకరిస్తాయేమో తప్ప సంపూర్ణంగా అనుమానాలను తొలగించలేవు. ఇ.వి.ఎం.లలో మాయ ఉందని మేం ఆరోపించడం లేదు కానీ ఓటర్లలో విశ్వాసం కల్గించే విధానం అనుసరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదననూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అనేక పశ్చిమ దేశాలలో ముందు ఇ.వి.ఎం.లను ఉపయోగించి మళ్లీ బ్యాలెట్‌ పేపర్ల పద్ధతి వినియోగిస్తున్నారన్న వాదననూ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇతర దేశాల సామ్యం మనకు ఉపకరించదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలో అసలు ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు. ‘‘మన దేశంలో నమోదైన ఓటర్లు 97 కోట్ల మంది ఉన్నారు. బ్యాలెట్‌ పత్రాలు వాడినప్పుడు ఏం జరిగిందో మనం చూశాం’’ అన్న న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా మాటలు సైతం ఓటర్లలో నమ్మకం కలగచేసేవి కాదు. జనాభా అధికంగా ఉన్నప్పుడు నియమ నిబంధనలు, కట్టు దిట్టాలు, ఓటింగ్‌ కు అనుసరించే పద్ధతి కూడా ఆ స్థాయిలోనే ఉండేట్టు చూడవలసిన బాధ్యత రాజ్య వ్యవస్థ మీద ఉంటుంది. ఇ.వి.ఎం.లలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరొపణ వ్యక్తిగతమైందో, ఊహాజనితమైందో అనుకున్నప్పుడు బ్యాలెట్‌ పత్రాలు వినియోగించినప్పుడు కూడా అక్రమాలు జరిగాయన్నది వ్యక్తిగతమైంది కాకుండా పోతుందా? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు సమాధానం చెప్పలేదు. ఇ.వి.ఎం.లలో నమోదైన ఓట్లను వి.వి.పాట్లలో ఉన్న సమాచారంతో పోల్చి చూడాలన్న సూచనను సైతం న్యాయమూర్తులు అంగీకరించలేదు. ‘‘60 కోట్ల వి.వి.పాట్లను లెక్కించాల్సిందేనంటారా?’’ అని యెదురు ప్రశ్న మాత్రం వేసింది. మనుషుల ప్రమేయం లేని యంత్రాలు కచ్చితమైన ఫలితాలు అందిస్తాయని చెప్పిన న్యాయమూర్తులు ఇ.వి.ఎం.లను మాయ చేయొచ్చునన్న వాదనను అంగీకరించకపోవడం విడ్డూరం. మనిషి తయారుచేసిన పరికరాన్ని ఆ మనుషులే మార్చొచ్చునన్న తర్కాన్నీ ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. మొత్తం మీద అత్యున్నత న్యాయస్థానం అనుమానాలైతే తీర్చలేదు. ఇక మిగిలిందల్లా ఇ.వి.ఎం.లను తారుమారు చేస్తున్న వారికి బుద్ధి చెప్పే బాధ్యత ఓటర్లదే. ఓటువేసే బాధ్యతను నిర్వర్తించడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అప్రమత్తంగా మెలగవలసిన బాధ్యతా ప్రజలదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img