Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అబద్ధాలలో మోదీ మేటి

మోదీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు దేశ ప్రగతికి బాటలు వేయకపోగా నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. కొత్తగా ఉద్యోగ, ఉపాధికల్పన జరగకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడంతో నిరుద్యోగ వృద్ధిరేటు రికార్డు స్థాయికి చేరింది. భారత ఆర్థికవ్యవస్థ ఏడు శాతం వృద్ధి చెందినప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగాలకల్పన జరగడం లేదని స్పష్టమవుతోంది. వచ్చే దశాబ్దంలో ఆ స్థాయిలో దేశం వృద్ధి చెందాలన్నప్పటికీ శ్రామికశక్తికి తగినంత ఉద్యోగాలను సృష్టించడానికి దేశం చాలా కష్టపడాల్సి వస్తుందని సిటీ గ్రూపు ఒక నివేదికలో వెల్లడిరచింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశానికి ఉపాధిని పెంచడానికి మరింత సమగ్ర చర్యలు అవసరమని సూచించింది. సహజంగా మన దేశంలో నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణాలు అధిక జనాభా, స్వల్ప ఉద్యోగావకాశాలు, కేంద్రీకృత సంపద. కేంద్రంలో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత ఉపాధి అవకాశాలు మరింత సన్నగిల్లడం, సంపద కేంద్రీకృతం విపరీతంగా పెరగడంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. మోదీ 2014 ఎన్నికల్లోనే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కొత్తవి రాకపోగా ఉన్నవి ఊడకొట్టారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఉపాధి అవకాశాలను మరింతగా దెబ్బతీశారు. గత పదేళ్లుగా కోట్లాదిమంది యువకుల కలలను ఛిన్నాభిన్నం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ప్రస్తుత ఏడాది జూన్‌లో నిరుద్యోగ రేటు ఏకంగా 9.2 శాతానికి ఎగిసి ఎనిమిది నెలల గరిష్టస్థాయి వద్ద నమోదైందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) గురువారం ఒక నివేదికలో వెల్లడిరచింది. ఇంతక్రితం మే నెలలో నిరుద్యోగస్థాయి రేటు 7 శాతంగా ఉంది. ఒక్క నెలలోనే అదనంగా 2.2 శాతం ఎగిసిపడటం ఆర్థిక వ్యవస్థలో డొల్లతనానికి మందగమనానికి నిదర్శనం. సీఎంఐఈ నిర్వహించిన కన్స్యూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌హోల్డ్‌ సర్వే నివేదిక ప్రకారం 2023 జూన్‌లో నమోదయిన 8.5 శాతం నిరుద్యోగంతో పోల్చినా గడిచిన నెలలో ఈ రేటు మరింత పెరిగింది. నిరుద్యోగుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతేడాది జూన్‌లో మహిళల్లో నిరుద్యోగం 15.1శాతంగా ఉంటే ఈ ఏడాది జూన్‌లో 18.5 శాతానికి పెరిగింది. పురుషుల్లో నిరుద్యోగం 7.7 శాతం నుంచి 7.8 శాతానికి చేరింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఆధారంగా సీిఎంఐఈ ఈ రేటును రూపొందిస్తుంది. ఐఎల్‌ఒ నివేదిక ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం యువత ఉన్నారు. ఇండియా ఎంప్లాయిమెంట్‌ రిపోర్ట్‌ 2024 ప్రకారం 2012-2019 మధ్య సుమారు 7 కోట్ల మంది యువత శ్రామికశక్తిలో చేరారు. దేశంలోని 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ 2023 నివేదిక తెలిపింది. ప్రజల సంక్షే మాన్ని విస్మరించి, కార్పొరేట్‌ సంస్థల సేవలో ఊడిగంచేస్తున్న కేంద్ర ప్రభుత్వం, దాని అధినేత మోదీ ఉద్యోగకల్పనపై చేస్తున్న ప్రకటనలు అందరూ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. శనివారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, గత మూడు నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని ప్రగల్బాలు పలికారు. కరోనా లాంటి సంక్షోభాలొచ్చినా దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పడం ద్వారా ఉద్యోగాల కల్పనపై అబద్ధాల వలవిసిరారు. అయితే, వాస్తవ పరిస్థితి మోదీ ప్రకటనకు భిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ వృద్ధి కలగ జేసే అనర్ధాలను అంచనా కట్టలేం. నిరాశా నిస్పృహలకు గురైన యువత అసాంఘిక శక్తుల చేతిలో పావులుగా మారే ప్రమాదం ఉంటుంది. మోదీ అధికారం చేపట్టాక పనిచేసే జనాభాలో సగం మందికి ఉద్యోగ, ఉపాధిలేకుండా పోయింది. ముఖ్యంగా 20-24 ఏళ్ల మధ్య వయస్కులలో నిరుద్యోగ రేటు ఏకంగా 40 శాతం కంటే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. శ్రామిక మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశించిన వారికి ఉద్యోగాలు కల్పించడానికి భారతదేశం వచ్చే దశాబ్దంలో సంవత్సరానికి సుమారు 1.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సిటీ గ్రూపు ఆ నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుత 7 శాతం వృద్ధి రేటు ఆధారంగా భారత్‌ సంవత్సరానికి 80-90 లక్షల ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలదని ఆ నివేదిక పేర్కొంది.
దేశంలో సృష్టిస్తున్న ఉద్యోగాల నాణ్యత మరొక సవాలుగా ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం 20 శాతం కంటే తక్కువ వాటాను కలిగి ఉన్నప్పటికీ… ఇప్పటికీ 46 శాతం మంది శ్రామికశక్తి ఉపాధి పొందుతున్నట్టు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. 2023లో మొత్తం ఉద్యోగాలలో తయారీ రంగం 11.4 శాతం వాటాను కలిగిఉంది. ఇది 2018 కంటే తక్కువ వాటా అని గణాంకాలు చెపుతున్నాయి. ప్రభుత్వ, బ్యాంకింగ్‌, విద్య, వైద్యం, తయారీ తదితర సంఘటిత రంగంలో 25.7 శాతం మంది పనిచేస్తున్నారు. ఇందులో కోవిడ్‌కు ముందు కంటే ఇప్పుడు తక్కువ మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. ఈ రంగంలో ఉద్యోగాలకల్పన కనీసం 18 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి తగ్గిందని సిటీ గ్రూపు తెలిపింది. 58.2 కోట్లమంది స్వయం ఉపాధి కల్పనతో బతుకుతున్నారు. దేశంలో దాదాపు 12.2 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగం ముఖ్యంగా ఓటర్లలో ప్రధాన ప్రభావం కలిగించింది. ఈ ప్రభావం బీజేపీ సీట్లు భారీగా తగ్గడానికి కారణమయింది. మేకిన్‌ ఇండియా అంటూ మోదీ హడావుడి తప్ప ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతినడంతో లక్షలాది మంది వీధిన పడ్డారు. రూపాయి పతనం, అంచనాలకందని వృద్ధిరేటు, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థలతో పరిస్థితి మరింత క్షీణించింది. ఈ కారణాలన్నింటితో కోట్లమందికి ఉపాధి కరవైంది. నిజవేతనాల్లో తగ్గుదలతో ప్రజల కొనుగోలుశక్తి సన్నగిల్లింది. నిరుద్యోగ వృద్ధిని అడ్డుకోవాలంటే తయారీరంగం పుంజుకునేలా చేయాలి. అందుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయం అందాలి. ఆ పనిచేయకుండా సంపన్నులను సంతృప్తి పరిచే చర్యలు చేపట్టడం వల్ల నిరుద్యోగ సమస్య ఎలా పరిష్కారమవు తుంది? మానవ వనరుల మీద వర్ధిల్లే చిన్న మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలు తిరిగి కోలుకునే చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కాబట్టి దేశాన్ని అభివృద్ధి చేశాం, ఉద్యోగాలు కల్పిస్తున్నామని మోదీ చెప్పడం వట్టి ప్రచారార్భాటం, యువతను వంచించడమే. ఇప్పటికైనా పాలకులను నిలదీసేందుకు యువత కదం తొక్కాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img