Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అవధులు మీరిన మోదీ అహంకారం

పార్లమెంటు సమావేశాలు జరగడమే అపురూపమైపొయిన రోజుల్లో గురువారం ప్రారంభమైన వర్షా కాల సమావేశంలో రెండు రోజులు ఏ కార్యకలాపమూ జరగనే లేదు. మణిపూర్‌ లో హింసాకాండపై మొదట ప్రధానమంత్రి ప్రకటన చేస్తే ఆ తరవాత చర్చలో పాల్గొంటామని ప్రతిపక్ష ‘‘ఇండియా’’ నాయకులు అంటున్నారు. పార్లమెంటు సమావేశాలను ఎవరు స్తంభింప చేస్తున్నారన్న విషయంపై పరస్పర నిందారోపణలే వినిపిస్తున్నాయని అనుకోవడానికి అవకాశం ఉండొచ్చు. కానీ మణిపూర్‌ అంశంపై పార్లమెంటులో చర్చ నుంచి తప్పించుకోవాలని అధికార పక్షం వేయగలిగినన్ని ఎత్తులు వేస్తోంది. రాజ్య సభలో 267వ నిబంధన కింద చర్చ చేపట్టాలని, వాయిదా తీర్మానం మీద చర్చ జరగాలని ప్రతిపక్ష ఐక్య సంఘటన కోరుతోంది. వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడ్తున్నాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పక్షానికి వాయిదా తీర్మానం అంటే కిట్టదు. మే నాల్గవ తేదీన ఇద్దరు కుకీ మహిళల మీద మూకుమ్మడి జరిగిన అత్యాచారానికి సంబంధించిన బుధవారం వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తరవాత ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనం చేరువలో విలేకరులతో యథాలాపంగా మాట్లాడుతూ మణిపూర్‌ అంశాన్ని ప్రస్తావించారు. అందులో సానుభూతి వచనాలే ఉన్నాయి తప్ప మణిపూర్‌ ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసా ఏమీ లేదు. దుర్మార్గమైన సంఘటన జరిగిన తరవాత రెండున్నర నెలలకు ప్రధానమంత్రి నోటి నుంచి నాలుగు ముత్యాలు రాలాయి. అక్కడికదే మహాప్రసాదం అని భావించాలన్నట్టుగా అధికారపక్షం ధోరణి ఉంది. ప్రతిపక్షాలు ప్రధాని దగ్గరి నుంచి సమాధానం అడుగుతుంటే అధికార పక్షం రాజకీయం చేస్తోంది. మణిపూర్‌ గురించి ప్రధాని పార్లమెంటులో మాట్లాడాలి అని ప్రతిపక్షాలు కోరుతుంటే బీజేపీ అధికార ప్రతినిధులు రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ లో జరిగిన అత్యాచారాల సంఘటనలు వర్ణించి కాలం వెళ్లబుచ్చుతున్నారు. మహిళల మీద అత్యాచారాలను సహించం అని ఈ అధికార ప్రతినిధులు చెప్తున్నారు. హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ఘోరాల గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. మహిళల మీద బోలెడు సానుభూతి ఒలకబోసే బీజేపీ ప్రభుత్వం మహిళా మల్ల యోధులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ను వెనకేసుకు వచ్చింది. ఆయన మీద చార్జి షీట్‌ ధాఖలైనా అరెస్టు చేయలేదు. మణిపూర్‌ లో దాదాపు రెండున్నర నెలలుగా నెలకొన్న పరిస్థితి కేవలం ఇద్దరు మహిళల మీద అత్యాచారం చేసి, హతమార్చడం గురించి మాత్రమే కాదు. ఇలాంటి ఉదంతాలు వంద దాకా ఉన్నాయని సాక్షాత్తు మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగే చెప్తున్నారంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ బీభత్స కాండపై ప్రభుత్వ పక్ష వైఖరి ఏమిటో తెలుసుకోవడానికే ప్రతిపక్షాలు ప్రధానమంత్రి ముందు ప్రకటన చేయాలంటున్నారు. మణిపూర్‌ లో హింసాకాండ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది కనక ఆయనే సభలో సమాధానం చెప్తారని అధికార పక్షం వాదిస్తోంది. ఇంతటి ఘోరమైన పరిస్థితిపై ప్రధానమంత్రి మాట్లాడితే నష్టం ఏమిటో ఆయనకు ఉన్న ఇబ్బంది ఏమిటో అన్న ప్రశ్నకు మాత్రం అధికార ప్రతినిధుల దగ్గర సమాధానం లేదు. ప్రధానమంత్రికి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేంత తీరిక కూడా లేదా? లేక సమాధానం చెప్పడానికి మొహం చెల్లడం లేదనుకోవాలా? ప్రధానమంత్రి మీద అనేక బాధ్యతలు ఉంటాయి కనక ఆయన ఎప్పుడూ ఏదో ఓ కార్యక్రమంలో నిమగ్నమై ఉండొచ్చు. కాదనలేం. కానీ ఒక రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడితే అది ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన విషయం అయిపోదు. దేశమంతటా మణిపూర్‌ వ్యవహారం కలత కలిగిస్తోంది. ప్రధానమంత్రి సభకు వచ్చి చర్చంతా వినాలని ప్రతి పక్షాలు అంటున్నాయి. ఇది వారి సంవేదనా ఫలితం కావొచ్చు. కానీ ప్రధాని ఎక్కడున్నా చర్చను వినే అవకాశం ఉంటుంది. ఆయన చర్చ జరిగినంత సేపూ సభలోనే ఉండడం కుదరక పోవచ్చు. కానీ ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్గం పార్లమెంటుకు బాధ్యతవహించాలి. ఆ బాధ్యత ప్రధానమంత్రికి ఉంటుందిగదా! ప్రధానమంత్రి సభలోకి రానని భీష్మించి కూర్చోవడానికి ఆయన వివిధ బాధ్యతల్లో నిమగ్నమై ఉండడం అన్నది కనీసం సాకుగా కూడా పనికి రాదు. ఇది మోదీ అహంకారానికి పరాకాష్ఠ. మాకు తిరుగులేని మెజారిటీ ఉంది కనక ఏం చేసినా చెల్లుతుంది అన్నది ఆయన అభిప్రాయం. ఇది అహంకారానికే ప్రతీక.

ప్రభుత్వ పక్షం మంకుపట్టువల్ల పార్లమెంటు సమయం వృథా కావడమే కాదు. మోదీ పార్లమెంటుకు వచ్చి సమాధానం ఎందుకు చెప్పడం లేదన్న ప్రశ్న కూడా ప్రజల మనసుల్లో అనుమాన మేఘాలు అలుముకునేట్టు చేస్తుంది. ఇంత తక్కువగా పార్లమెంటుకు హాజరైన ప్రధానమంత్రి మరొకరు లేరు. ప్రధానమంత్రి మణిపూర్‌ గురించి ప్రస్తావించినప్పుడు రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ పరిస్థితిని కూడా ప్రస్తావించడం యాదృచ్చికం కాదు. అక్కడ కొద్ది శాసనసభ ఎన్నికలు నెలల్లో జరగవలసి ఉంది. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ లో అధికారంలో ఉంది.
ఈ రెండు రాష్ట్రాలలో వాతావరణం బీజేపీకి అంత అనుకూలంగా లేదు. మహిళల గౌరవం కాపాడడం అన్న రొడ్డకొట్టుడు మాటలు దొర్లించి సానుభూతి సంపాదించాలన్నది మోదీ ఎత్తుగడ. బీజేపీ నాయకులు బెంగాల్‌ లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలను కూడా ప్రస్తావిస్తున్నారు. అంటే పద్ధతి ప్రకారం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల పరిస్థితిని మాత్రమే ఎత్తి చూపుతోంది. కానీ ప్రతిపక్షం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ నెలల తరబడి ఇంటర్నెట్‌ అందుబాటులో లేకుండా చేయలేదు. ఈ కట్టడి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే కనిపిస్తోంది. కశ్మీర్‌లో సుదీర్ఘ కాలం ఇంటర్నెట్‌ లేకుండా చేయడంవల్ల సెన్సార్షిప్‌ అమలయ్యేట్టు చేసింది బీజేపీనే. ఈ రెండు రాష్ట్రాలలో వాతావరణం బీజేపీకి అంత అనుకూలంగా లేదు. బుధవారం వెలికి వచ్చిన వీడియో గురించి ప్రతిపక్షాలకు ముందే తెలుసునని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయం గురించి తెలుసునని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానిజాలేమిటో నిగ్గు తేల్చడానికి అయినా ప్రధానమంత్రి పార్లమెంటుకి హాజరు కావచ్చుగా! ఈ విషయంలో చర్చకు ప్రధానమంత్రే సమాధానం ఇవ్వనక్కరలేదని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. సాంకేతికంగా అది నిజమేననుకున్నా ప్రధాని చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో తనూ పాల్గొనొచ్చు. అనుమానాలు దూరం చేయొచ్చు. కానీ ఆయన అందుకూ సిద్ధంగా లేరు. తమ వైఫల్యాలపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం మాత్రమే దీనికి కారణం కాదు. హాజరు కాకపోతే ఏం చేస్తారు లెమ్మన్న అవధులు మీరిన ధీమా కూడా దీనికి కారణం. అధిక మెజారిటీ ఉన్నది సమర్థమైన పరిపాలన అందించడానికి. కానీ ఈ అత్యధిక మెజారిటీ మోదీలో అహంకారాన్నే పెంచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img