Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇజ్రాయిల్‌కు కళ్లెం పడేనా!

ఏడు నెలల నుంచి పలస్తీనియన్లకు నెలవైన గాజా నెత్తురోడుతోంది. ప్రపంచంలోకెల్లా ఏకైక తీవ్రవాద దేశమైన ఇజ్రాయిల్‌ పలస్తీనియన్‌ జాతినే అంతమొందించాలన్న కసితో గాజాపై నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్ధ తంత్రంలో భాగంగా ఇజ్రాయిల్‌ అధినేత నెతన్యాహూ గాజా పౌరులను ఆకలికి మాడ్చి చంపుతున్నారు. యుద్ధంతో ఏ మాత్రం సంబంధంలేని వారిని అమానుషమైన బాధలు పెడ్తున్నారు. ఉద్దేశ పూర్వకంగానే జనంపై బాంబుల వర్షం కురిపించి అంతమొందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌ ఏడున పలస్తీనియన్ల అస్తిత్వ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న హమాస్‌ ఒక్కుమ్మడిగా, హఠాత్తుగా రాకెట్లతో మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది మరణించారు. 252 మంది ఇజ్రాయిలీలను హమాస్‌ బందీలను చేసింది. దీనికి ప్రతీకారంగా నెతన్యాహూ పలస్తీనియన్ల మీద వారి భూభాగాల మీద పూర్తిస్థాయి యుద్ధమే ప్రకటించారు. ఈ యుద్ధంలో ఇంతవరకు కనీసం 35,000 మందికి పైగా మరణించారని అంచనా. ఇజ్రాయిల్‌ దాడిలో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, జనావాసాలు అన్నీ నేలమట్టమైనాయి. ఉత్తర గాజా ప్రస్తుతం శ్మశానం కన్నా హీనంగా ఉంది. బాంబుల భయానికి శవాలను పీక్కు తినే గద్దలు కూడా ఆ ప్రాంతంలో వాలడానికి భయపడుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, బాలలే. యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి వస్తున్నా రక్త దాహం తీరని నెతన్యాహూ కాల్పుల విరమణకు అంగీకరించడం లేదు. ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదానికి కళ్లెం వేయడంలో ఐక్యరాజ్య సమితి కూడా సంపూర్ణంగా విఫలమైంది. చివరికి ఇటీవల రంజాన్‌ నెలలోనైనా కాల్పుల విరమణ పాటించాలన్న ఐక్యరాజ్య సమితి పిలుపును నెతన్యాహూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే ఏ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడానికి ఆయన సిద్ధంగా లేరు. గాజా మీద ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న యుద్ధం కన్నా నెతన్యాహూ సేనలు పాల్పడుతున్న యుద్ధ నేరాలు చాలా భయంకరమైనవి. హమాస్‌ ను నిర్మూలించే మిషతో నెతన్యాహూ భారీ ఎత్తున మారణ కాండను కసిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా అంతర్జాతీయ కోర్టులో ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న జాతి విధ్వంసానికి వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన అంతర్జాతీయ కోర్టు గత జనవరిలో జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని ఇజ్రాయిల్‌ కు ‘‘విజ్ఞప్తి’’ చేసింది. కానీ మానవ రక్తం రుచి మరిగిన నెతన్యాహూకు ఈ విజ్ఞప్తులు చెవికెక్కుతాయనుకోవడం భ్రమే. అత్యంత చిన్న దేశమైన ఇజ్రాయిల్‌ దగ్గర నెలల తరబడి యుద్ధం కొనసాగించడానికి ఎంత ఆయుధ సంపత్తి ఉందో ఊహించుకోవలసిందే. ఐక్య రాజ్య సమితికి సహకరించాలని, గాజాలో పలస్తీనియన్లకు మానవతా సహాయం అందించడానికి సహకరించాలని అంతర్జాతీయ న్యాయస్థానం కోరింది. ఐక్య రాజ్య సమితి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి దాకా ప్రపంచంలో ఏ యుద్ధాన్నీ ఆపలేక పోయింది. ఐక్య రాజ్య సమితిలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. విజ్ఞప్తులు, తీర్మానాలు వెలువడుతూనే ఉంటాయి. కాని ఏ యుద్ధోన్మాదులూ వీటిని పట్టించుకోరు. పైగా ఈ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టడంలో నెతన్యాహూ సిద్ధహస్తుడు. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన హమాస్‌ ఇజ్రాయిల్‌పై రాకెట్‌ దాడులు చేయడం సబబేనా అని ప్రశ్నించే వారికి కొదవ ఉండదు. హమాస్‌ దాడిని ఎవరూ సమర్థించనవసరం లేదు. కానీ హమాస్‌ దాడి ఏడు దశాబ్దాలకు పై నుంచి కొనసాగుతున్న బాధిత జాతి ఎనలేని కష్టాలకు ప్రతిస్పందన. 1948 మే 14 కు ముందు పశ్చిమాసియాలో ఇజ్రాయిల్‌ అనే దేశమే ప్రపంచపటం మీద లేదు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత అప్పటి సామ్రాజ్యవాద శక్తులు పలస్తీనియన్ల భూభాగం మీద బలవంతంగా యూదుల కోసం ఇజ్రాయిల్‌ అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతకు ముందు నుంచి అక్కడ ఉంటున్న పలస్తీనియన్ల మీద అనునిత్యం దాడులు చేస్తూనే ఉంది. తమ హక్కులు కాపాడుకోవడం కోసం పలస్తీనియన్లు ఆయుధాలు పట్టక తప్పని స్థితి కలగజేసింది. అందుకే ఒకప్పుడు యాసిర్‌ అరఫాత్‌ నాయకత్వంలో, ఆ తరవాత హమాస్‌ నాయకత్వంలో పలస్తీనియన్లు అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ 76 ఏళ్ల కాలంలో ఇజ్రాయిల్‌ పలస్తీనా మీద ఎన్నిసార్లు దాడి చేసిందో లెక్కలేదు.
దక్షిణాఫ్రికా ఫిర్యాదును పరిశీలించిన అంతర్జాతీయ కోర్టు చివరకు యుద్ధ నేరాలకు పాల్పడిన నెతన్యాహూ అరెస్టుకు వారెంట్‌ జారీ చేయాలని ఆలోచిస్తోంది. నెతన్యాహూతో పాటు ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి, యవో గాలెంట్‌ ను, ముగ్గురు హమాస్‌ నాయకులు – వహ్యా సిన్వర్‌, మహమ్మద్‌ దియాబ్‌ ఇబ్రహిం అల్‌-మస్రీ, ఇస్మాయిల్‌ హనియెప్‌ా ను అరెస్టు చేయడానికి వారెంట్లు జారీ చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌ కోరుతున్నారు. హమాస్‌ దాడిని కూడా అంతర్జాతీయ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కానీ అంతర్జాతీయ ఉగ్రవాద దేశాధిపతి నెతన్యాహూను, ఒక జాతిని సంరక్షించడానికి అనివార్యంగా పోరాటం కొనసాగించక తప్పని హమాస్‌ నాయకులను ఒకే గాట కట్టడం విచిత్రం. ఇది ఏ రకంగా చూసినా నిష్పక్షపాత ప్రవర్తన కాదు. దాడికి పాల్పడే వారిని, దాడికి గురయ్యే వారిని ఒకే గాట కట్టడమే. అంటే అంతిమంగా దాడికు పాల్పడే వారి పక్షాన నిలవడమే. హమాస్‌ ‘‘అకృత్యాల’’ జాబితా కూడా కరీం ఖాన్‌ విడుదల చేశారు. రాజ్య విధానంగా యుద్ధం కొనసాగిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్న వారిని, ఆ దురాగతాలకు ఎదురొడ్డి నిలుస్తున్న వారిని సమదృష్టితో చూస్తున్నామని వాదించడం అంతర్జాతీయ న్యాయస్థానం చేసినా సమర్థనీయం కాదు. నెతన్యాహూను అరెస్టు చేయడానికి తాను అంతర్జాతీయ న్యాయ నిపుణులను సంప్రదించానని, వారు తన వాదనతో అంగీకరించారని కరీం ఖాన్‌ అంటున్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఒక వేళ నెతన్యాహూను అరెస్టు చేయడానికి వారెంట్‌ జారీ చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయించినా పెద్దగా ఫలితం ఉంటుందన్న ఆశ లేదు. ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న అమానుష దాడుల వెనక అమెరికా హస్తం ఉంది. ఒకప్పుడు సామ్రాజ్యవాద దేశంగా ఉన్న బ్రిటన్‌, ఆ తరవాత ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఎప్పుడూ ఇజ్రాయిల్‌ కు దన్నుగానే నిలిచాయి. ప్రజాస్వామ్యాన్ని ఎగుమతి సరుకుగా మార్చిన అమెరికా ఎన్నడూ ఏ దేశంలోనూ ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పిన ఉదంతమే లేదు. అమెరికా ఎప్పుడూ దుర్మార్గానికి ఒడిగట్టే వారికే మద్దతు ఇస్తూ ఉంటుంది. ఇజ్రాయిల్‌ కు పీకల లోతుల దాకా ఆయుధాలు సరఫరా చేస్తున్నది అమెరికానే. నెతన్యాహూ యుద్ధం ప్రకటించిన వెంటనే ఇజ్రాయిల్‌ కు అండగా యుద్ధ నౌకలను ఆయుధాలను పంపించింది. గాజాలో కొనసాగుతున్న మారణకాండకు నెతన్యాహూకు ఎంత బాధ్యత ఉందో అమెరికాకు అంతకన్నా ఎక్కువ బాధ్యతే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img