Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉద్యోగులను విభజించే కుట్ర

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకలా పాలలో ప్రభుత్వోద్యోగులు భాగస్వామ్యం కావడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో వినాశకర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. నిషేధాన్ని ఎత్తివేస్తూ భారత ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరి విమల్‌ జులై9వ తేదీన జారీ చేసిన ఆదేశాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వ తాజా నిర్ణయం తీవ్ర రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. 1966 నవంబరు 30, 1970 జులై 25, 1980 అక్టోబరు 28 తేదీలలో ఇచ్చిన ఆదేశాలలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్తావనను తొలగించాలని నిర్ణయించినట్టు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలలో పాల్గొనడంపై 58 ఏళ్ల క్రితం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని తొలగిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేయగా, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తెగసంబర పడిపోతున్నాయి. ఇందిరాగాంధీ ప్రభుత్వం జారీ చేసిన రాజ్యాంగవిరుద్ధ ఆదేశాలను మోదీ ప్రభుత్వం ఉపసం హరించుకున్నదని బీజేపీ నేత అమిత్‌ మాల్వియా వ్యాఖ్యానించారు. 1948జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీ హత్య తరువాత సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారు. సత్ప్రవర్తనతో మెలగుతానని ఆర్‌ఎస్‌ఎస్‌ హామీ ఇవ్వడంతో ఆ తరువాత నిషేధాన్ని ఎత్తివేశారు. తదనంతరమూ ఆర్‌ఎస్‌ఎస్‌ ధోరణిలో మార్పులేదు. కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్‌లో ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిష్కరించలేదు. జాతివ్యతిరేక చర్యలు కొనసాగించడంతో 1966లో ఆరెస్సెస్‌లో ప్రభుత్వ ఉద్యోగులు చేరడంపై ప్రభుత్వం నిషేధించింది. ఆర్‌ఎస్‌ఎస్‌, జమాత్‌-ఇ-ఇస్లామీ ప్రభుత్వోద్యోగులు పాల్గొనడంపై 1966లో ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆరెస్సెస్‌ మాతృ సంస్థ. కేంద్రంలో బీజేపీ విజయం సాధించడంలో ఆరెస్సెస్‌ పాత్ర ఎంతో ఉందనేది దేశం మొత్తం తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లలో విజయం సాధిస్తామని బీరాలు పలికిన బీజేపీ మెజారిటీ మార్కును కూడా అందుకోలేకపోవడంతో ఆరెస్సెస్‌ నేతలు నరేంద్ర మోదీపై, బీజేపీపౖౖె బహిరంగంగానే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. అహంకారంతోనే భారీగా సీట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఫలితాలు వెల్లడైన తర్వాత ఆరెస్సెస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం తీవ్ర దుమారానికి కారణం అయింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయనీ, వారితోపాటు నేతలంతా గాలి బుడగను నమ్ముకుని పని చేశారని అందులో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపైనే ఆధారపడ్డారని.. ప్రజల గొంతుకలు వినలేదని ఆ వ్యాసం వెల్లడిరచింది. నిజమైన సేవకుడు అహంకారం కలిగి ఉండడనీ ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ కోపాగ్నిని చల్లార్చేందుకు మోదీ నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుట్టుచప్పుడు కాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ విధమైన ఉత్తర్వులు జారీచేయడం ద్వారా సైద్ధాంతిక ప్రాతిపదికన ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులతో రాజకీయాలు చేసే కుట్రకు ప్రధాని మోదీ తెరలేపారు. ప్రభుత్వోద్యోగుల తటస్థ భావనకు, రాజ్యాంగ ఔన్నత్యానికి ఈ చర్య తీవ్ర సవాలుగా పరిణమిస్తుందనడంలో అనుమానమేలేదు. 1966 తరువాత వచ్చిన ప్రభుత్వాలేవీ కూడా ఈ నిషేధాన్ని ఎత్తివేయనప్పుడు నేడు ఆ అవసరం ఎందుకు వచ్చిందో మోదీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో కూడా ఈ నిషేధం ఎత్తివేయడానికి సాహసించలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉపయోగించుకుని రాజ్యాంగ బద్ధ, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను సంస్థాగతంగా స్వాధీనం చేసుకున్న కాషాయ పార్టీ ఇప్పటికే రాజ్యాంగ సంస్థలను ధ్వంసంచేసిన విషయం జగద్విదితమే. రాజ్యాంగాన్ని మార్చాలన్న తన కుటిల ఉద్దేశాన్ని ప్రజలు తిప్పికొట్టినందువల్లే మోదీ ప్రభుత్వం తాజా చర్య తీసుకున్నదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే గత ప్రభుత్వాలు నిషేధం అమలుచేశాయన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాదనలో పసలేదు. నిషేధం ఎత్తివేతతో దేశంలో ప్రజాస్వామ్యం మరింత పటిష్టమంతం అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ పేర్కొంది. కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని కితాబిచ్చింది. రాజకీయ కారణాలతోనే 1966లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిషేధం విధించిందన్న కేంద్ర మంత్రి పియూష్‌ గోయెల్‌ వ్యాఖ్యలు సత్యదూరం. ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయవాద సంస్థ అనీ, దాని సభ్యులు దేశభక్తులని ఆయన కితాబిచ్చారు. ప్రతిపక్షాలవి బుజ్జగింపు రాజకీయాలని, హిందూ వ్యతిరేక వైఖరి అని గోయెల్‌ విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి అతి జాతీయవాద సంస్థలపై కాంగ్రెస్‌ మొదటి నుంచి వ్యతిరేక భావంతో ఉన్నదనీ, దేశంలో అలాంటి ఆలోచనలకు తావులేదన్న గోయెల్‌ వ్యాఖ్యలు విచారకరం. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుకూలంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఉద్యోగులను విభజించే కుట్రే. ఇందులో ఎటువంటి అనుమానంలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులను మంచి చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్న బీఎస్‌పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యల్లో నిజంలేకపోలేదు. కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించినట్టుగా మోదీ పాలనలో ప్రభుత్వోద్యోగులు ఇకపై నిక్కర్లతో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రభుత్వోద్యోగులతో రాజకీయాలు చేసే మోదీ ప్రభుత్వ ఈ విధమైన కుట్రను ప్రతిపక్షాలు, వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఐక్యతతో నిలిచి తిప్పికొట్టాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img