Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కొయ్యకాళ్ల ప్రభుత్వం

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరవాత బిజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ. బలం కేవలం 262. బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే ఎన్‌.డి.ఎ. భాగస్వామ్య పక్షాలన్నింటినీ కలిపినా 262 సీట్లు మాత్రమే ఉన్న మోదీకి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశంలేదు. చంద్రబాబు నాయకత్వంలోని టీ.డి.పి. కి దక్కిన 16 స్థానాలను, పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జన సేన సాధించిన రెండు స్థానాలను, జె.డి.(యు) కు వచ్చిన 12 సీట్లు కలిపితే కానీ మోదీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం రాలేదు. ఎన్‌.డి.ఎ.లో పేరుకు 41 పార్టీలున్నప్పటికి అందులో 22 పార్టీలకు లొక్‌సభలో ప్రాతినిధ్యమే లేదు. ఎన్‌.డి.ఎ. లో చాలా పార్టీల పేర్లు చెప్పడం కూడా సాధ్యం కాదు. తెలుగుదేశం, జనసేన, జె.డి. (యు) ఎన్‌.డి.ఎ.లో భాగస్వామ్య పక్షాలు కావు. ఇవి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెలుపలి నుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నాయి. తెలుగు దేశం, జనతా దళ్‌(యు) ప్రభుత్వం ఏర్పాటులో మోదీకి సహకరించడానికి ఈ రెండు పార్టీలు అంగీకరించినా అవి విధించే షరతులు మోదీకి సంకటంగానే ఉన్నాయి. తెలుగు దేశం, జనతా దళ్‌(యు) పార్టీలు తమ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరుతున్నాయి. ఈ రెండు పక్షాలు ఈ డిమాండును తాత్కాలికంగానైనా పక్కన పెడితే తప్ప మోదీకి మద్దతుఇచ్చే వీలేలేదు. ఇప్పటికే ఈ రెండు పక్షాలు షరతులు పెట్టడంతో పాటు కీలక మంత్రిపదవులు కోరుతున్నాయి. అధికారంలో భాగస్వామ్యం ఉండాలన్నదే ఈ రెండు పక్షాల ప్రధాన లక్ష్యం కనక ప్రత్యేక ప్రతిపత్తి డిమాండును పక్కనపెట్టి మద్దతు ఇవ్వాలని నిర్ణయించు కున్నట్టున్నాయి. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా డిమాండును మాటవరసకు వల్లించినా పట్టు పట్టకపోవచ్చు. మోదీకి మద్దతు ఇవ్వడం ద్వారా కేంద్ర రాజకీయాల్లో తాము చక్రం తిప్పే స్థితిలో ఉండాలని చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ కోరుకుంటున్నారు. చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ అనుభవ జ్ఞులైన, రాజకీయ పరిణతి ఉన్న నాయకులు. ఎప్పుడు ముందడుగు వేయాలో, ఎప్పుడు వేచి చూడాలో, ఎప్పుడు వెనక్కు తగ్గాలో వీరికి బాగా తెలుసు. మోదీతో బంధాలు తెంచుకుని ఎప్పుడు వెనక్కు తిరగాలో కూడా వారికి బాగా తెలుసు. అన్నింటికీ మించి సంకీర్ణ ప్రభుత్వాలు నడిపే స్వభావం మోదీకి ఎన్నడూ లేదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తరవాత పదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మోదీ తన మాటే చెల్లించుకునే రీతిలోనే వ్యవహరించారు. ఆయనది ఆధిపత్యం చెలాయించే ధోరణే తప్ప సర్దుబాటు చేసుకోవడం, ఇతరుల మాట వినే తత్వం లేదు. చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ గతంలోనూ బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్న వారే. కానీ కిందటి సారి చంద్రబాబు ఎన్‌.డి.ఎ.తో తెగతెంపులు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే ప్రధాన కారణం. ఈ రెండు పార్టీలకు మతతత్వ ధోరణి కూడా లేదు. అయితే మతతత్వ వాదులతో తమకు అవసరమైనప్పుడు కలిసి నడిచిన సందర్భం ఉంది. అన్నింటికన్నా మించి తెగ తెంపులు చేసుకున్న తరవాత చంద్రబాబు ఎన్నడూ ఇతర పార్టీలతో కలిసి పనిచేయలేదు.
ప్రతిపక్ష ఐక్యత కోసం ప్రయత్నించిన సంఘటనలు నితీశ్‌ కు ఉన్నాయి. చంద్ర బాబు ప్రతిపక్ష ఐక్యత కోసం ఎప్పుడైనా పని చేసినా అది తనకు మేలు కలిగే దృష్టితో మాత్రమే చేశారు. ఎన్‌.టి.ఆర్‌. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేశారు. ఆ దశలోనే నేషనల్‌ ఫ్రంట్‌ 1989లో ఏర్పడిరది. ఎన్‌.టి.ఆర్‌. నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా ఉండే వారు. ఆ దశలో ఎన్‌.టి.ఆర్‌. మాటను జవదాటే అవకాశం చంద్రబాబుకు లేదు.
ఎన్నిసార్లు కప్పదాట్లు వేసినా నితీశ్‌ కుమార్‌ సైద్ధాంతికంగా సోషలిస్టు భావాల ఇంగువ గడ్డగానే ఉన్నారు. గత జనవరిలో మళ్లీ కప్ప దాటు వేయకముందు నితీశ్‌ ప్రతిపక్ష ఐక్యత కోసం చేసిన కృషి విస్మరించడానికి వీలు లేనిది. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావ్‌, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చంద్రబాబు ప్రతిపక్ష ఐక్యత కోసం చేసిన ప్రయత్నాలన్నీ వారి నాయకత్వంలో ప్రతిపక్షాలు ఐక్యం కావడం కోసమే. అందుకే ఆ విన్యాసాలేవీ దరి చేరలేదు. ఇప్పుడు మోదీకి అండగా నిలవాలని నిర్ణయించిన చంద్రబాబుకు, నితీశ్‌ కుమార్‌ కు మధ్య భావసారూప్యతా శూన్యమే. మోదీ నడపాలనుకుంటున్న సంకీర్ణ ప్రభుత్వానికి ఉండబోయే రెండు చక్రాలు ఏ రూపంలోను సామ్యం ఉన్నవి కావు. సంకీర్ణ ప్రభుత్వాలు మనకు కొత్త కాదు. పీవీ నరసిం హా రావు అయిదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటుచేసి విజయవంతంగా నెగ్గుకొచ్చారు. అప్పటి సమీకరణలు భిన్నమైనవి. ప్రభుత్వ సారథికి నెగ్గుకొచ్చే నైపుణ్యంఉండి తీరాల్సిందే. మోదీకి అది లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించలేక పోవడానికి మోదీ వ్యవహారశైలే ప్రధాన కారణం. పదేళ్లు అధికారంలోఉన్న తరవాత ఏ ప్రభుత్వం మీదైనా అసంతృప్తి పెరగడం సహజమే. మొట్ట మొదటి సారి ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించబోతున్నారు. సం యమంతో వ్యవహరించడం మోదీ తత్వం కాదు కనక అది అంత సులభమైన విషయం కాదు. నియంతకు ఉండవలసిన సంపూర్ణ మెజారిటీ ఇప్పటిదాకా మోదీ బండి నడపడానికి ఉపకరించింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే సంయమనం, చొరవ, ఓరిమి వాటిని అలవరచుకునే శక్తి కూడా మోదీకి ఉండే అవకాశం లేదు. చంద్రబాబుకు, నితీశ్‌ కుమార్‌కు ఉప ప్రధాని పదవులు ఇవ్వొచ్చునన్న ఊహాగానాలు సాగుతున్నాయి. తాను కేంద్రానికి వెళ్తే రాష్ట్రంలో తన ఆధిపత్యం ఎక్కడ తగ్గుతుందోనన్న అనుమానం చంద్రబాబును ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది. తన తరవాత ఎక్కువ ప్రజాదరణ ఉన్న నాయకుడు రాష్ట్రంలో పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే. కానీ ఆయనకు అసెంబ్లీలో వచ్చిన స్థానాలకన్నా తెలుగు దేశానికి ఉన్న బలం చాలా ఎక్కువ. అందువల్ల పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశంలో చిచ్చు రేగవచ్చు. అధికారం సంపాదించడానికి మాత్రమే చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌తో సఖ్యంగా ఉన్నారు తప్పితే చూస్తూ చూస్తూ అధికారం అప్పగించేటంతటి ఔదార్యం ఆయనకు లేదు. ఆయన అసలు లక్ష్యం తన కుమారుడికి ఎప్పుడో ఒకప్పుడు తన వారసత్వం అప్పగించాలనే. ఏమైతేనేం మోదీ ప్రభుత్వం హంసపాదుతోనే మొదలు కాక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img