Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

తప్పించుకు తిరుగువాడు

మణిపూర్‌లో మూడు నెలలుగా జరుగుతున్న విధ్వంసం, మారణకాండ, క్రైస్తవుల మీద దాడి గురించి ప్రధానమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు ఎంతగా పట్టుబట్టినా ఆయన నోటి నుంచి ముత్యాలు రాలలేదు. ఆయన పార్లమెంటులో అడుగే పెట్టలేదు. వరసగా ఇదే అంశం మీద పార్లమెంటులో ఎంత రభస జరిగినా ప్రధానమంత్రి నోరు మెదపడానికి సిద్ధం కాకపోవడంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది. అవిశ్వాస తీర్మానంమీద జరిగిన సుదీర్ఘ చర్చకు సమాధానం ఇచ్చిన మోదీ తన ప్రసంగంలో మణిపూర్‌ మారణకాండ మీద పెద్దగా చెప్పిందేమీలేదు. ఆ సమస్యకు బాధ్యత కూడా ప్రతిపక్షాలమీద తోసేసి షరా మామూలుగా తప్పించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఎప్పుడెప్పుడు ఏయే పొరపాట్లు చేసిందో ఏకరవు పెట్టడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ప్రతిపక్షాల విమర్శలకు, లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంచెప్పే సమయంలో ఆయన అసలు అంశాలను ప్రస్తావించకుండా తన వాక్ప్రవాహ నైపుణ్యం మీదే అధికంగా ఆధారపడ్డారు. అవిశ్వాస తీర్మానంమీద మాట్లాడే అవకాశం కాంగ్రెస్‌ పక్షనాయకుడు అధీర్‌ రంజన్‌ సర్కార్‌కు ఇవ్వనందుకు మోదీ కడివెడు కన్నీళ్లు కార్చారు. కానీ సభలో సవ్యంగా ప్రవర్తించలేదని ఆరోపిస్తూ అధికార పక్షానికి ఉన్న విపరీతమైన మెజారిటీని ఆధారంగా చేసుకుని అధీర్‌ రంజన్‌ను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. తమ ప్రభుత్వం సాధించిన ‘‘విజయాల’’ను ప్రపంచమంతా కీర్తిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం తన ప్రభుత్వ ఘనతను గుర్తించడంలేదని నొచ్చుకున్నారు. మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభమై గురువారానికి సరిగ్గా వంద రోజులైంది. మణిపూర్‌ అంశంపై ప్రధానమంత్రి చేత ప్రతిపక్షాలు ప్రకటన చేయించలేక పోయాయి. అయినా అవిశ్వాస తీర్మానానికి మోదీ సమాధానం చెప్పక తప్పలేదు. మోదీ ప్రసంగిస్తున్నంతసేపూ సభలో అధికారపక్ష సభ్యులు ‘‘మోదీ, మోదీ’’ అన్న నినాదాలు చేస్తూనే ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడూ బీజేపీకి శుభప్రదంగానే ఉపయోగపడిరదని మోదీ తనవీపు తానే చరుచుకున్నారు. మోదీ సమాధానం మొత్తం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగంగానే కొనసాగింది. ఆ ప్రసంగం నిండా సారం తక్కువ, ఆర్భాటం ఎక్కువ అని అవిశ్వాసతీర్మానం ప్రతిపాదించిన ప్రతిపక్ష ఫ్రంట్‌ ‘‘ఇండియా’’ కు చెందిన సభ్యులు పోస్టర్లు ప్రదర్శించారు. కానీ ఈ సంఘటనను చూపించకుండా సన్సద్‌ టీవీ ముఖం తిప్పేసుకుంది. అప్పుడే ప్రతిపక్షాలు ‘‘మణిపూర్‌, మణిపూర్‌’’ అని నినదించవలసి వచ్చింది. సభ్యతం పునరుద్ధరించిన తరవాత రాహుల్‌ లోకసభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడినప్పుడు కేవలం మోదీ ప్రభుత్వాన్ని తూలనాడడానికే పరిమితం కాలేదు. రాహులే కాదు ఏ ప్రతిపక్ష నాయకుడి ప్రసంగమూ 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రసంగాలుగా కనిపించలేదు. బుధవారం అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 125 నిమిషాలు మాట్లాడి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాన మంత్రి మోదీ ఆ రికార్డును విజయవంతంగా బద్దలుకొట్టి 133 నిమిషాలు మాట్లాడారు. అసలు విషయాన్ని ప్రస్తావించకుండా తమ స్వోత్కర్షకు అమిత్‌ షా, మోదీ సకల జాగ్రత్తలూ తీసుకున్నారు. రాహుల్‌ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానంచెప్పే శక్తి కోల్పోయిన అధికార పక్షం ఊకదంపుడు ఉపన్యాసాలను, రికార్డులు సృష్టించే క్షుద్ర ప్రక్రియను ఆశ్రయించవలసి వచ్చింది. బుధవారం అమిత్‌ షా ప్రసంగం పునరుక్తులతోనే సరిపోయింది. మోదీ మాత్రం తన తొమ్మిదేళ్ల పాలనను సమర్థించుకునే క్రమాన్ని, జాతీయవాదాన్ని సంకుచిత రాజకీయాలకు, హిందుత్వవాదులు చెప్పే జాతీయతావాదాన్ని విడమర్చడానికి వినియోగించుకున్నారు. బీజేపీ అనుసరించేది నిఖార్సయిన జాతీయతావాదం అని నిరూపించడానికి మోదీ నానా ప్రయాస పడవలసి వచ్చింది. భారతీయ జాతీయవాదం గురించి చెప్పడానికే మోదీ ప్రసంగం అంకితమైంది. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు అన్న ఆరోపణలకు జవాబివ్వలేని అధికారపక్షం ప్రతిపక్షాలపై దాడితో సరిపెట్టుకోక తప్పలేదు. ప్రతిపక్షాలు ఇంత తీవ్రమైన విమర్శలు గుప్పిస్తాయని అమిత్‌ షా కూడా ఊహించినట్టు లేదు. పాత సంఘటనలను పునరావృతం చేయడంతోనే ఆయన సంతృప్తి పడవలసి వచ్చింది.
అయితే ప్రధానమంత్రి అసలు విషయాలు ప్రస్తావించకుండా తన ప్రసంగమంతటినీ ఆత్మస్తుతి, పరనిందకు పరిమితం చేసినప్పుడు ప్రతిపక్షాలు సభనుంచి వాకౌట్‌ చేశాయి. దాదాపు ప్రతిపక్ష స్థానాలన్నీ ఖాళీగా ఉండిపోయాయి. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినప్పుడల్లా తన ప్రభుత్వం మరింత ఎక్కువ మెజారిటీతో గెలుస్తుందని మోదీ తారీకులు, దస్తావేజులతో సహా వివరించారు. ఈ ఒక్క అంశమే ఆయనది అవిశ్వాస తీర్మానానికి సమాధానం కాదు ఎన్నికల ప్రచార ప్రసంగం అని రుజువు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు 2018లో ప్రతిపాదించిన, ఇప్పుడు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలు ప్రతిపక్షాల బలం ఎంత బలహీనమైందో నిరూపించడానికే ఉపయోగపడ్డాయని చెప్పడంతో మోదీ మెదడు ఎన్నికల మూసలోంచి బయటకురాదని తేలిపోయింది. మోదీ మొత్తం 133 నిమిషాలు ప్రసంగిస్తే మొదటి 90 నిముషాలలో మణిపూర్‌ మారణకాండ ప్రస్తావనే రాలేదు. అంటే ప్రధానమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా వాగ్దాటితో సమస్యను దాటవేసే కళలో అద్వితీయుడినని మరోసారి నిరూపించుకున్నారు. ఈ కారణంగానే ప్రతిపక్షాలు వాకౌట్‌ చేయవలసి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నాయకత్వంలోని బి.ఆర్‌.ఎస్‌., శిరోమణి అకాలీదళ్‌ సభ్యులు సైతం ప్రతిపక్షాలతో పాటు వాకౌట్‌ చేశారు. అంటే మోదీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత గూడుకట్టుకుందో అంచనా వేయవచ్చు. చివరలో మాత్రం మణిపూర్‌ ఇక ముందు అభివృద్ధి పథంలో కొనసాగుతుందని మోదీ ఊరడిరపు పలుకులు పలికారు. హింసాకాండలో బీజేపీ పన్నాగంపై సహజంగానే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ శాంతి నెలకొనేట్టు చేస్తామని ప్రధాని ఇచ్చిన హామీలో డొల్లతనం మాత్రమే కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ద్వారా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాలపై తిట్లు లంకించుకోవడంతో ఆయన వైఖరి ఏమిటో స్పష్టం అయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని ఎవరూ భ్రమ పడలేదు. కానీ మణిపూర్‌ ప్రజలకు న్యాయం కలగాలన్న ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ఈ తీర్మానం రూపంలో మరోసారి గొంతెత్తి చెప్పడానికి వీలైంది. మణిపూర్‌ అంశంపై మోదీ నిర్దిష్టంగా మాట్లాడాలన్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. సూక్ష్మంగా మోదీ మణిపూర్‌ అంశాన్ని ప్రస్తావించినా అందులోనూ ప్రతిపక్షాలను దూషించడంతోనే సరిపుచ్చుకున్నారు. మణిపూర్‌ గురించి ప్రస్తావించాలని ప్రతిపక్షాలవారు ఎన్నిసార్లు అడిగినా మోదీ తన ధోరణిలోనే కొట్టుకుపోయారు. ప్రతిపక్షాల లక్ష్యం సంపూర్ణంగా నెరవేరక పోయినా చాలా కాలం తరవాత మోదీ నోరు తెరిపించడం సాధ్యమైంది. ఫక్తు పలాయనవాది నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం! మోదీ మణిపూర్‌ ప్రజలనే కాక దేశవాసులందరినీ అవమానించినందుకే ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img