Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తరగతి గదిలోనే దేశ భవితవ్యం

ప్రాథమిక దశలో వికాస దీపం వెలిగించి, అనంతర కాలంలో ఆ కాంతుల్ని దేదీపమానం చేస్తూవిజ్ఞానఖనుల్ని, ప్రయోగశీలుర్ని అవతరింప జేయడమే విద్య మౌలిక లక్ష్యం. విజ్ఞానంకోసం పెట్టే పెట్టుబడి ఎప్పటికీ సత్ఫలితాలు అందిస్తుందనేది అక్షరసత్యం. దేశీయంగా అది సక్రమంగా నెరవేరుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం బహిరంగ రహస్యమే! ఈ పెట్టుబడి నేడు మన దేశంలో పిల్లలను ధనార్జన యంత్రాలుగా మార్చేస్తోంది తప్ప విజ్ఞానధనులుగా తీర్చిదిద్దలేక పోతున్నదనేది వాస్తవం. విద్యాబోధనను వ్యాపారంగా మార్చేసిన విద్యా సంస్థల యాజమాన్యాల ధోరణే దీనికి ప్రధాన కారణం. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రతిభా పాటవాల గుర్తింపు, పరీక్షల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు, సర్కారీ బడుల్లో నాణ్యత పెంపు... అంటూ బడి చదువులకు త్రిముఖ వ్యూహాన్ని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించింది. ఇదంతా కొద్దిపాటి తేడాలతో ఎప్పటి నుంచో రకరకాల ప్రతిపాదనల్లో వచ్చిందే. ఉన్నత విద్యకు సంబంధించి కూడా ఉత్తమ పనితీరు కనబరచే కళాశాలలకు, యూనివర్సిటీలకు స్వయంప్రతిపత్తి కట్టాబెట్టాలని కూడా ప్రతిపాదించింది. విద్యాలయాల్ని శ్రేణులుగా వర్గీకరించి, కార్యసరళినిబట్టి పరిశోధన నిధులు కట్టబెట్టే ఆలోచన చేసింది. దీనివల్ల స్థాయీభేదాలు తీవ్రతరమవుతాయన్న యథార్థాన్ని నీతి ఆయోగ్‌ అర్ధంచేసుకోలేక పోయింది. మోదీ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన నూతన విద్యావిధానంలో సమగ్ర దృష్టి కొరవడిరది. విద్యను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలో చివరగా 1992లో విద్యావిధానం మార్పులకు గురైంది తర్వాత గడిచిన మూడు దశాబ్దాల్లో మారిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, శాస్త్రసాంకేతిక రంగాల్లోని మార్పులకు అనుగుణంగా సమర్థవంతమైన ప్రణాళికతో దీన్ని తీర్చిదిద్దారా అంటే లేదనే అనేక మంది విద్యావేత్తలు, సామాజిక నిపుణులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బడుగు బలహీన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యను అందుకునే అవకాశం మరింత తగ్గిపోయే విధంగా మోదీ ప్రభుత్వ విధానాలున్నాయి. కొన్ని పార్శ్వాల్ని స్పృశించినంత మాత్రాన విద్యారంగం అగ్నిపునీత అయిపోతుందా? పునాది స్థాయి నుంచీ విద్యావ్యవస్థను పటిష్ఠపరిచి, ఉన్నత చదువులకు కాయకల్ప చికిత్స చేసి- అర్హులు, సుశిక్షితులైన బోధన సిబ్బందిని కొలువుతీరిస్తేనే... పాలకుల దశాబ్దాల అసమర్థ నిర్వాకాల బారినుంచి జాతి తెరిపిన పడగలిగేది. ప్రస్తుతం దేశంలోని 1923 సంవత్సరాల వయసుగల యువతీ యువకుల్లో 28.4శాతం మంది మాత్రమే ఉన్నత విద్యను అందుకోగలుగుతున్నారు. ఈ ఏడాది మార్చి 7న విడుదల చేసిన ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే 2022- 23 ప్రకారం ఉన్నత విద్యలో విద్యార్థుల భాగస్వామ్య రేటు లేదా స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 28.4 శాతానికి పెరిగింది. ఇది 2020-21 నుంచి 1.1 శాతం పెరుగుదల. చండీగఢ్‌, పుదుచ్చేరి, దిల్లీ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, తెలంగాణలో అత్యధిక జీఈఆర్‌ నమోదైంది. భారత దేశంలో ఉన్నత విద్య అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ సర్వే తెలిపింది. ప్రాప్యత, సమానత్వాన్ని నిర్ధారించడం ఉన్నత విద్య ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు వంటి అట్టడుగు వర్గాలకు మధ్య గణనీయమైన అసమానత ఉంది, వారు నాణ్యమైన ఉన్నత విద్యను పొందడంలో గణనీయమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారని ఆ సర్వే పేర్కొంది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు అందిస్తున్న విద్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధనలు చాలా పరిమితంగా జరుగుతున్నాయి. బోధనా సంస్థలు, పరిశోధనా సంస్థలు వేర్వేరుగా ఉండడమే అందుకు కారణమని తేల్చింది. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో పరిశోధన, అభివృద్ధికి వెచ్చిస్తున్న ఖర్చు, పరిశోధకుల సంఖ్య చాలా తక్కువని ‘ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంకేతిక సంస్థ (యునెస్కో)2017 నివేదిక పేర్కొన్నది. యూజీసీ, ఏఐసీటీఈ, న్యాక్‌ తదితర సంస్థల్లోని అక్రమాలు, అవకతవకలు, బయటివారి నియామకాలు, పెత్తనాల వల్ల ఉన్నత విద్య అభివృద్ధికి నోచుకోవడంలేదని కస్తూరి రంగన్‌ కమిటీ ఎత్తిచూపింది. ప్రతిభని కాదని సీనియారిటీకే అవకాశాలు ఇవ్వడం వల్ల రీసర్చ్‌ ఇన్నోవేషన్‌కి ప్రోత్సాహం కొరవడిరదని వ్యాఖ్యానించింది. దేశంలో ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు దారుణంగా ఉన్నట్లు ‘నీతి ఆయోగ్‌’ స్వయంగా నిర్ధారిస్తోంది. ఈ దుర్బల పునాదులపై సుదృఢ విద్యాసౌధం నిర్మాణం పగటి కలే. ఈ నేపథ్యంలో నూతన విద్యావిధానం ముసాయిదాలోని ప్రతిపాదనలు విద్యను కార్పొరేట్‌ పరంచేసేలా ఉన్నాయి. పేదలకు చదువును దూరం చేసేందుకు దోహదపడ తాయనడంలో సందేహంలేదు. నాణ్యత లేకపోవడం, ఉద్యోగానికి ఉపయోగపడకపోవడం మన ఉన్నత విద్యలోనున్న పెద్ద బలహీనత. ఉద్యోగాల కోసం వెళ్లే గ్రాడ్యుయేట్లలో సగం మందికి ఇంటర్వ్యూలో పాల్గొనే మెళుకువలు కూడా ఉండడం లేదని ‘ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌2023’ వెల్లడిరచింది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 20శాతం మంది మాత్రమే తగిన ఉద్యోగాలకు అర్హులవుతున్నారని ప్రైవేట్‌ ఏజెన్సీలు నిర్వహించే ఎంప్లాయబిలిటీ రిపోర్ట్‌ పేర్కొంది. ఇలాంటి మౌలిక లోపాలు, లొసుగులు, బలహీనతలను అధిగమించే సిఫార్సులు మాత్రం ముసాయిదాలో కనిపించవు. మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు, ఆర్థికంగా చేయూత కొరవడడం మన విశ్వవిద్యాలయాల పురోగతికి తీవ్ర ప్రతిబంధకాలు సృష్టిస్తోంది. రాశికాదు, వాసి ఘనంగా ఉండాలి. అధిక కేటాయింపులతోపాటు సిబ్బంది ఖాళీల సత్వర భర్తీ, భావి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా కోర్సుల రూపకల్పన, అడుగడుగునా జవాబుదారీతనం సాకారమైతేనే మన ఉన్నత విద్య గాడినపడే అవకాశం ఉంటుంది. బడి చదువులు సవ్యంగా పట్టాలకు ఎక్కక, ఉన్నత విద్యారంగం గుల్లబారుతున్న భారత్‌లో నిపుణ కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. సార్థక విద్య, సొంతకాళ్లపై నిలబెట్టగల నైపుణ్యాలే భావితరాలకు బంగరు భవిష్యత్తు సమకూర్చగలుగుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ భవితవ్యం తరగతి గదిలోనే ఉంది!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img