Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పేదరికం తగ్గిందా…!

దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ఈ ఘనత అంతా ప్రధాని నరేంద్రమోదీదేనని పాలక పార్టీ బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. స్వయంగా ప్రధాని మోదీ అభివృద్ధి సాధించామని, దేశంలో పేదరికం తగ్గిందని ప్రకటించాక భజన రాయుళ్లు సొంత ప్రచార యంత్రాంగం విజృంభించి జనాన్ని నమ్మించడానికి పూనుకున్నాయి. ప్రభుత్వం వాస్తవ గణాంకాలను వెల్లడిరచడం లేదు. వృద్ధి జరిగింది వాస్తవమే. అయితే ఆ వృద్ధి అంతా నల్ల కుబేరులకే చేరింది. సామాన్య జనం పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. 2011 తర్వాత జరిగిన కాలంలో భారతదేశంలో పేదరికం తగ్గిందని చెప్పేందుకు తగిన ఆధారాలు కనిపించడంలేదని తాజా నివేదికలో వెల్లడిరచింది. ఇది అంతర్జాతీయ సంస్థ నివేదిక గనుక తాము నమ్మడంలేదని కూడా మన బీజేపీ ప్రభుత్వం వాదించే అవకాశాలు మెండుగా ఉంటాయి. పేదరికం తగ్గించడానికి అనేక సామాజిక సహాయ పథకాలను అమలు జరుపుతున్నందున పేదరికం తగ్గిందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. కొవిడ్‌`19 దేశ ప్రజలను వణికించిన కాలంలో జాతీయ ఆహార భద్రతాచట్టం 2013 కింద 50 నుంచి 75శాతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ధాన్యం సరఫరా చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఈ విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. పేదరికం తగ్గినప్పుడు 75శాతం ప్రజలకు ధాన్యం సరఫరా చేయవలసిన అవసరం ఉంటుందా! అంటే పేదరికం తమ పాలనా కాలంలో గణనీయంగా తగ్గిందని ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేయడం ఎన్నికల జిమ్మిక్‌ అనుకోవాలి. ఇలాంటి  అసంబద్ధమైన అసత్య ప్రచారం చేసుకోవడం బీజేపీ ప్రభుత్వానికే చెల్లింది. కరోనా విజృంభించిన కాలంలో దేశంలో లక్షల్లో ప్రజలు మృత్యువుతో పోరాడుతున్నా మోదీ మాత్రం ఆనాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సేవలో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను పార్లమెంటులో ఆమోదింపచేసుకునే పనిలో తలమునకలై ఉన్నాడు. కరోనా దేశంలో ప్రవేశించిన శైశవ దశలోనే లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలను అల్లకల్లోల పరచిన మోదీ పేదరికం తగ్గిందని ప్రకటించడం కేవలం బూటకమే. పైగా 21రోజుల్లో కరోనాను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించి నవ్వులపాలైన విషయం దేశప్రజలు ఇంకా మరిచిపోలేదు. కరోనా వైరస్‌ రుగ్మతలో తల్లడిల్లి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ,  ప్రైవేటు ఆరోగ్యవ్యవస్థ అనామకంగా ఉండటం వల్ల  ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యం రోజు రోజుకు కోటి నుంచి పదికోట్లు ఆపైన సంపాదించారు. చికిత్సపేరుతో పేదలు చేసిన అప్పులు నేటికీ తీరలేదన్న విషయాన్ని ప్రభుత్వం నేటికీ అంగీకరించదు. పేదల సంఖ్య 25కోట్లకుపైగా ఉందని రిజర్వు బ్యాంకు తన అంతర్గత నివేదికలో పేర్కొన్నట్లు  అనధికారిక సమాచారం. దేశ ఆర్థికవ్యవస్థ  నేటికీ పూర్తిగా కోలుకోలేదు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆహార ఉత్పత్తులు పెరిగి అభివృద్ధిలో తన పాత్రను ఇనుమడిరప చేసింది.

కరోనాతో లక్షలాదిమంది ప్రాణాలు హరిస్తున్న కాలంలోనే కార్పొరేట్లకు లక్షా 45వేల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటించి నల్ల కుబేరులు ఎన్నికల ప్రచార సమయంలో కోట్లు విరాళాలు అందుకున్న బీజేపీ ప్రభుత్వం రుణం తీర్చుకున్నదని అనేకమంది విశ్లేషకులు వ్యాఖ్యానాలు చేశారు. భారతదేశం సహా ప్రపంచ పేదరికం రేటు 11శాతం పెరిగిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక తెలిపింది. అంతో ఇంతో పేదిరకం తగ్గినప్పటికీ కరోనా మహమ్మారి హరించివేసింది. అంతే కాదు దిగువ మధ్యతరగతి ప్రజల్లో కాస్త ఆదాయం పెరిగిందన్న సూచనలు తుడిచిపెట్టుకుపోయి ఇంకా అప్పులు పాలుచేసింది. వారి ఆర్థికపరిస్థితులు నేటికీ పుంజుకోలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు నిరుద్యోగం ఏనాడులేనంతగా అధికమైనప్పటికీ అభివృద్ధిలో దేశం పరుగెడుతోందని బీజేపీ పాలకులు నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవినీతి మరింతగా విస్త్రతమైనప్పటికీ, దీన్నినిర్మూలించామని చెప్పడం మరింత హాస్యాస్పందంగా ఉంది.బ్యాంకుల్లో లక్షలు, కోట్ల రూపాయలు అప్పుతీసుకున్న బడాబాబులు అప్పులను తిరిగిచెల్లించకుండా విదేశాలకు వెళుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసే సామాన్య, దిగువ, మధ్య తరగతి ప్రజల కష్టార్జితమే ఇది. ప్రభుత్వాలు, బ్యాంకులు అప్పులు వసూలు చేసేందుకు కఠినచర్యలు తీసుకోకుండా వారు చెల్లించవలసిన అప్పులను రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్‌ప్రభుత్వం కూడా అప్పులను రద్దు చేసింది. తాను అధికారంలోకి వస్తే బ్యాంకులను సంస్కరించి అప్పులు రద్దుచేసే పరిస్థితి లేకుండా చేస్తానని ఎన్నికల ప్రచారసభల్లో నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ పూర్తిగా మరిచిపోయారు. మోదీ ప్రధానిగా పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014`15వ సంవత్సరం నుంచి 2023 మార్చి 31నాటికి 14.49లక్షల కోట్ల రూపాయలను అప్పులు ఎగవేసిన కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తల బకాయిలను రద్దు చేశారు. తాను సమర్థుడైన పాలకుడుగా ప్రచారం చేయించుకోవడానికి కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. గురువిందగింజ తన కిందవైపునఉన్న నలుపును చూడ లేనట్టుగానే తన అసమర్థపాలనను ఒప్పకోకపోయినా కనీసం మార్చు కోవడంలేదు. దాదాపు నాలుగేళ్లకుపైగా పెరుగుతున్న నిత్యావసర ధరలు పెరుగుతున్నప్పటికీ వాటిని తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం ఏ చర్య తీసుకోలేదు. ఆయన అధికారంలోకివచ్చే నాటికి గృహ వినియోగానికి అందించే గ్యాస్‌సిలిండర్‌ ధర 404రూపాయలుండగా అది నేడు పదకొండు వందల రూపాయలకు పైగా ఉంది. ఈ విధంగా వినియోగ దారులైన ప్రజలపైన భారం మోపారు. ఇలా అనేక విషయాలలో విఫలమైన మోదీ అసమర్థపాలన ప్రజలకు హాని చేసేదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img